వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానందకు అమావాస్య కష్టాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
సినీ నటి రంజితతో రాసలీలలు నడుపుతూ పట్టుబడిన స్వామి నిత్యానందకు కొత్త సమస్య వచ్చి పడింది. ఆయన కోర్టు నుంచి కొత్త కోరిక కోరాడు. తాను వెల్లడించిన అంశాలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులను ఎడిట్ చేయకుండా బయటపెట్టాలని కోరుతూ స్వామి నిత్యానంద రామనగరం జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్‌కు సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. రంజితతో లైంగిక కార్యకలాపాలకు సంబంధించి 2010 ఏప్రిల్ 21, 30 తేదీల మధ్య తనను విచారించినప్పుడు వెల్లడించిన అంశాలకు సంబంధించిన రికార్డింగులను బయటపెట్టాలని సిఐడిని ఆదేశించాలని ఆయన కోరారు.

సిఐడి చెప్పినట్లు పేర్కొంటూ మీడియా తనపై వార్తాకథనాలను రాస్తోందని, తాను 15 మందితో లైంగిక కార్యకలాపాలు నెరిపినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇస్తున్నాయని, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అదుపులోని సెక్స్ కోరికలతో నిత్యానంద రెచ్చిపోతాడని మరికొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయని, సిఐడి విచారణలో తాను చెప్పినట్లుగానే ఈ వార్తలన్నీ వచ్చాయని ఆయన చెప్పుకున్నారు.

అటువంటి వాంగ్మూలాలు తాను ఎక్కడా ఇవ్వలేదని స్వామి నిత్యానంద చెప్పారు. తన శిష్యులతో సెక్స్ కార్యకలాపాలు నెరిపినట్లుగా కూడా తాను అంగీకరించలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో మార్చి 31వ తేదీ లోగా అభ్యంతరాలను తెలియజేయాలని మెజిస్ట్రేట్ సిఐడికి నోటీసులు జారీ చేసింది.

English summary
Swami Nithyananda on Monday filed an application before the Chief Judicial Magistrate, Ramanagaram, seeking direction to the CID to furnish unedited audio and video recordings of the interrogation he was subjected to between April 21 and April 30, 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X