వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పై విమర్శలకు దారితీస్తున్న డైరెక్టర్స్..!

|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
ఓ పక్క పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తుండడం సంతోషపెడుతుంటే మరోపక్క యధావిధిగా వినిపిస్తుండడం పవన్ ఫ్యాన్స్ ని విసిగిస్తోంది. రాజమౌళి, పూరి జగన్నాథ్, వివి వినాయక్ వంటి మన మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అందరికీ దూరంగా వుండే పవన్ తరచూ తమిళ దర్శకులనే నమ్ముతున్నాడనేది మీడియా కామెంట్.. అప్పుడెప్పుడో కరుణాకరన్ ని ప్రోత్సహించి 'తొలిప్రేమ"తోనూ, ఎస్ జె సూర్యను తెలుగుకి తెచ్చిన 'ఖుషీ"తోనూ హిట్లు కొట్టినప్పటికీ ఆపై అదే కరుణాకరన్, సూర్యలు 'బాలు-పులి" రూపంలో ఫ్లాప్స్ ఇచ్చేసి వెళ్లారు.

అలాగే 'బంగారం"తో ధరణి కూడా నిరాశపరిచాడు. అయినా మరోసారి ఇంకో తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణువర్థన్ కి అవకాశమిచ్చిన పవన్ త్వరలో డ్యాన్స్ మాస్టర్ రాజుసుందరంకీ సినిమా చేస్తాననడం, అందులోనూ ఆ చిత్రం ఎస్ జె సూర్య కథతో రూపొందనుండడం విమర్శకుల వాదనకు ఇంకాస్త బలాన్ని చేకూర్చింది. అన్నట్టు, ఈ తమిళ దర్శకులూ, అరవ కథల సంగతి ఇలా వుంటే అరువు కథత హరీష్ శంకర్ చేయాల్సిన 'గబ్బర్ సింగ్" అటకెక్కిందనే వ్యాఖ్యలూ వినవస్తుండడం గమనార్హం..!

ప్రస్తుతం కోల్ కతాలో 'కాళీ' చిత్రం షూటింగులో బిజీగా వున్న పవన్ కల్యాణ్, దీని తర్వాత 'గబ్బర్ సింగ్' సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. 'మిరపకాయ్' చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేశారు. హిందీ చిత్రం 'దబాంగ్' రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నప్పటికీ తెలుగు నేటివిటీకి, పవన్ కల్యాణ్ ఇమేజ్ కీ అనుగుణంగా కథను పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది.

English summary
Power Star Pawan Kalyan who is currently busy with film The Shadow, directed by Tamil director Vishnuvardhan, is marking his Telugu debut, then Pawan will commence Gabbar Singh directed by Harish Shankar, the remake of Bollywood hit Dabangg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X