వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ డబ్బుపై రత్నాకర్ కొత్త సంగతులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ratnakar
ఇటీవల కొడికొండ చెక్ పోస్టు వద్ద దొరికిన రూ.35 లక్షల డబ్బుపై ట్రస్టు సభ్యుడు, సత్యసాయి బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ కొత్త సంగతులు చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఆ డబ్బు పన్నెండు మందికి చెందినదని చెబుతూ వచ్చిన ఆయన, తాజాగా అది ట్రస్టుది కాదని ఎల్అండ్‌టి సంస్థదని చెప్పుకొచ్చారు. పోలీసుల విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.35 లక్షలు ఎల్ అండ్ టికి సంబంధించినదన్నారు. సత్యసాయి ట్రస్టుపై కొంతమంది పని కట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. తాను పోలీసులకు అన్ని విషయాలు అందించానని చెప్పారు. కేసు కోర్టులో ఉండడంతో బహిర్గతం చేయలేనన్నారు.

ట్రస్టు సభ్యుల మధ్య విభేదాలేమీ లేవని, ఇందులో విశ్రాంత జడ్జిలు, ఐఏఎస్ అధికారులు కొన్ని దశాబ్దాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నారన్నారు. తాను సత్యసాయి బంధువుగా కాకుండా సేవా సంస్థ ప్రతినిధిగా సేవలందిస్తున్నానన్నారు. కొన్ని మీడియా సంస్థలు బంగారం, డబ్బు తరలిపోయిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఇది మానుకోవాలని సూచించారు. మీడియాలో ఏదో వచ్చిందని వెంటనే స్పందించడానికి తాము రాజకీయ నాయకులం కాదని, సేవా సంస్థలో పనిచేసే వారమని అన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తామన్నారు. దేశానికే గర్వకారణమైన సత్యసాయి మహోన్నత వ్యక్తి అని, అలాంటి వ్యక్తి స్థాపించిన సంస్థ సేవలు పెద్ద ఎత్తున విస్తరింపజేస్తామన్నారు.

తాను పెనుకొండ కోర్టులో లొంగిపోయానని, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నానని లేనిపోనివన్నీ మీడియా సృష్టిస్తోన్నారు. సత్యసాయి భక్తులు 160 దేశాల్లో ఉన్నారని, సత్యసాయి సేవలు ప్రపంచ వ్యాప్తంగా పారదర్శకంగా కొనసాగుతున్నాయని చెప్పారు. తాగునీరు అందించినా, ఉచిత వైద్యం చేయిస్తున్నా అదంతా ప్రజాసేవ కోసమేనని, అందులో ట్రస్టుకు స్వార్థం లేదన్నారు. ఎవరూ ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, అంతా పారదర్శకంగానే కొనసాగుతుందని, సత్యసాయి ఆశయాలను కొనసాగించేందుకే ట్రస్టు పనిచేస్తుందని పేర్కొన్నారు.

English summary
Sathya Sai Trust member Ratnakar told new story on Rs.35 lacks issue, which amount police found at Kodikonda check post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X