వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమ్మె కట్టడికి రూ. 48 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ సకల జనుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం 48 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు హోం శాఖ బుధవారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సమ్మెను అదుపు చేయడానికి హోం శాఖ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)కి అదనంగా రూ. 33.82 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు కూడా హోం శాఖ అదనపు నిధులు మంజూరు చేసింది. హైకోర్టు వద్ద భద్రత పెంపునకు కూడా అదనపు నిధులు విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటలిజెన్స్ అదనపు డిజికి దాదాపు 4 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా సిసిటివి కెమెరాలను, సంబంధిత పరికరాలను కొంటారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు రూ. 5.54 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై జాప్యం చేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. ఈ నెల 9,10,11 తేదీల్లో రైల్ రోకోను తలపెట్టింది. సకల జనుల సమ్మెను దెబ్బ తీయడానికి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమ్మెపై అవసరమైతే బలప్రయోగం చేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే అదనపు నిధులు కూడా విడుదల చేసి భద్రతా చర్యలకు శ్రీకారం చుడుతోంది.

English summary
The government has sanctioned Rs 48 crore to counter the Telangana strike.The home department on Wednesday issued orders releasing the money for security arrangements in view of the ongoing agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X