వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ ఆట తప్పుల తడక

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్‌పై జరిగిన ప్రపంచ కప్ పోటీల సెమీ ఫైనల్‌లో భారత్ స్కోరును పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కానీ సెంచరీల సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. ఈ మ్యాచులో అతను ఆ ఫీట్ సాధించకపోవడమే మంచిదైందని అనుకోక తప్పదు. కనీవినీ ఎరుగని రీతిలో సచిన్ ఈ మ్యాచులో పేలవంగా ఆడాడు. తన సహజశైలికి భిన్నమైన ఆటను ప్రదర్శించాడు. సచిన్ వందో సెంచరీ చేయకుండా అడ్డుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ మాటలు పాకిస్తాన్ ఫీల్డర్లపై ఒత్తిడి పెంచే ఉంటుంది. దానివల్లనే సచిన్‌ను అవుట్ చేయడంలో కామెడీ ఎర్రర్స్‌కు పాల్పడ్డారు. తప్పుల తడకగా సాగిన బ్యాటింగుతో వందో సెంచరీ చేయకపోవడం పట్ల భారత క్రికెట్ అభిమానులు సంతోషించాల్సిందే. ఈ మ్యాచులో అతను సెంచరీ చేసి ఉంటే క్రెడిట్ కన్నా అపకీర్తి ఎక్కువగా దక్కి ఉండేది.

తప్పుల మీద తప్పులు చేస్తూ బతికిపోతూ వచ్చాడు. అందుకు పాకిస్తాన్ ఫీల్డర్లు చేయాల్సినంత సహాయం చేశారు. ఆఫ్రిదీ సచిన్‌ను అడ్డుకోవాలనే ఒత్తిడి వల్లనే పాకిస్తాన్ ఆటగాళ్లు తప్పులు చేస్తూ వచ్చారని చెప్పవచ్చు. పాకిస్తాన్ ఆటగాళ్లు క్యాచ్‌లు డ్రాప్ చేస్తూ రావడంతో సచిన్ అంత సేపు ఆడగలిగాడు. పదకొండో ఓవరులో సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యుగా సచిన్ వెనుదిరగాల్సిందే. కానీ టెండూల్కర్ అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టమ్‌ను వాడుకుని బతికిపోయాడు. ఈ సిస్టమ్‌ను తీవ్రంగా తప్పు పడుతూ వచ్చిన సచిన్ దాన్ని వాడుకోవాల్సిన అగత్యంలో పడ్డారు. ఆ తర్వాతి ఓవరులో స్టంపింగ్ ద్వారా అవుటయ్యేవాడే. కానీ కొద్దిలో తప్పించుకున్నాడు. మూడు ఓవర్ల తర్వాత మిస్బావుల్ హక్ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. బౌలర్ ఆఫ్రిదీ ఆ క్యాచ్ డ్రాప్ చేసినందుకు తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యాడు. సచిన్ 45 పరగులు వద్ద ఉన్నప్పుడు ఆఫ్రిదీ బౌలింగులోని అతి సాధారణమైన క్యాచ్‌ను యూనిస్ ఖాన్ జారవిడిచాడు. ఈ సమయంలో ఆఫ్రిదీలో కోపం పైకి తన్నుకుని వచ్చింది.

సచిన్ 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్లమ్ కుడి పక్కకు వేగంగా కదలడంలో విఫలమయ్యాడు. మరో సారి సచిన్‌కు లైఫ్ వచ్చింది. ఈసారి కూడా అఫ్రిదీయే బౌలర్ కావడం విశేషం. ఈసారి తలపై చేతులు పెట్టుకుని ఆఫ్రిదీ విచారం వ్యక్తం చేశాడు. అతనిలో తీవ్ర నిస్పృహ కనిపించింది. మరోసారి మొహ్మద్ హఫీజ్ బౌలింగులో ఉమర్ అక్మల్ క్యాచును వదిలేశాడు. సెంచరీ చేయడానికి మరో 15 పరుగులు కావాల్సిన స్థితిలో ఆఫ్రిదీ డైవ్ చేసి క్యాచ్ పట్టి సచిన్‌ను అవుట్ చేశాడు. రెండు సార్లు అంపైర్ నిర్ణయాన్ని రివ్యూకు ఇవ్వడం ద్వారా, నాలుగు సార్లు పాకిస్తాన్ ఫీల్డర్లు క్యాచులను వదిలేయడం వల్ల టెండూల్కర్ బతికిపోతూ 85 పరుగులు చేశాడు. ఇటువంటి ఆటను తాను ఎన్నడూ ఆడలేదని సచిన్ టెండూల్కర్ కూడా అన్నాడు. ఇటువంటి ఇన్నింగ్సులో సచిన్ వందో సెంచరీ సాధించకపోవడమే మంచిదైంది కావచ్చు.

English summary
Even as the occasion got to some of the players, Tendulkar shaped India's total but the century of centuries, the 100th, could not have come in this error-prone way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X