వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు, వర్మ మధ్య గొడవల వెనక?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi and Ram Gopal Varma
మేగాస్టార్ చిరంజీవికి, ప్రముఖ దర్శకనిర్మాత రామ్‌గోపాల్ వర్మకు మధ్య దూరం పెరగడానికి గల కారణాలపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిరంజీవితో సినిమా తీయాలని రామ్ గోపాల్ వర్మ చాలా ఆసక్తి ప్రదర్శించారు. కానీ, అది రూపు దిద్దుకోలేదు. దొర - ది లార్డ్ పేర చిరంజీవి కోసం ఓ సినిమా తీయడానికి వర్మ సిద్ధపడ్డారు. అది కార్యరూపం ధరించలేదు. వర్మ పద్ధతి గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఎవరి మీదనైనా ఏ విధమైన వ్యాఖ్యలైనా చేయగలరు. తాను అనుకుంది మొహమాటం లేకుండా అనేస్తాడు. పైగా సైటైర్లు కూడా విసురుతుంటారు.

వర్మకు ఒకప్పుడు గడ్డం చక్రవర్తి అనే జెడి చక్రవర్తి వర్మకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. నిజానికి, చక్రవర్తి సినీ జీవితం వర్మతో ముడిపడి ఉన్నట్లుగా అనిపించేది. ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా తీసుకుని జెడి చక్రవర్తి చిరంజీవికి వర్మపై ఉన్నవీ లేనివీ చెప్పేశారట. చిరంజీవిపై వర్మ సైటైర్లు విసిరాడంటూ కొన్ని ఉదాహరణలను కూడా ఆయన చేరవేశారని చెబుతారు. దీంతో వర్మపై చిరంజీవి మండిపడడం ప్రారంభించారని అంటారు. దీంతో వర్మకు, చిరంజీవికి మధ్య తేడాలు వచ్చాయని సమాచారం.

అయితే, ఆ తర్వాత చిరంజీవికి అసలు విషయం తెలిసిందట. చక్రవర్తి ఇరువురి మధ్య గొడవలు పెట్టి తన సినిమాకు దర్శకత్వం వహించాలని ఆశపడ్డాడని, అందులో భాగంగానే వర్మతో విభేదాలు సృష్టించాడని చిరంజీవికి తెలిసి వచ్చిందని అంటారు. దీంతో చక్రవర్తి అటు వర్మకూ ఇటు చిరంజీవికీ - ఎవరికీ కాకుండా పోయాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
It is said that JD Chakravarthy has created differences between Chiranjeevi and Ramgopal Varma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X