• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్ క్రికెట్‌ను మార్చేసిన ఆఫ్రిదీ

By Pratap
|

Shahid Afridi
పాకిస్తాన్ జట్టును నాయకత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత షాహిద్ ఆఫ్రిదీ పూర్తిగా మార్చేసినట్లే కనిపిస్తున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో, గిల్లి కజ్జాలతో నిత్యం అట్టుడికిపోతున్న పాకిస్తాన్ క్రికెట్‌కు ఇప్పుడు ఆట మాత్రమే ప్రధానమైనట్లు కనిపిస్తోంది. వన్డే మ్యాచులకు షాహిద్ ఆఫ్రిదీని కెప్టెన్‌గా ఎంపిక చేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మంచి పనే చేసినట్లు చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ మాటలను బట్టి కూడా ఆ విషయం అర్థమవుతుంది. ఆఫ్రిదీ జట్టులో ఐక్యతను సాధించాడని అతను అన్నాడు. జట్టు సీనియర్ సభ్యులు, కోచ్‌లతో సంప్రదిస్తూ జట్టును ముందుకు నడిపించే ఆరోగ్యకరమైన విధానానికి ఆఫ్రిదీ పాదులు వేశాడు.

ఆఫ్రిదీ గమ్మత్తయిన ఆటగాడు కూడా. అతనిలో ఆట పట్ల కసి కనిపిస్తుంది. మైదానంలో ఉన్నంత సేపు అతను ఆట గురించి తప్ప మరో ఆలోచన చేయడు. ప్రత్యర్థి జట్టు ఎంతటి సత్తా కలదైనా దాన్ని ఓడించి తీరాలనే పట్టుదల అతనిలో కనిపిస్తుంది. ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి అతన్ని గమనిస్తున్న వాళ్లు ఆ విషయాన్ని తప్పకుండా అంగీకరిస్తారు. లుకలుకలతో పాకిస్తాన్ జట్టు ఏం ఆడుతుంది లే అనుకున్నవాళ్ల నోళ్లు మూయించాడు.

పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఎలో టాప్‌లో నిలిచిందంటే ఆ కీర్తి ఆఫ్రిదీకి దక్కాల్సిందే. ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఇంటికి పంపిన తర్వాత గానీ ఆఫ్రిదీ నాయకత్వ పటిమ ఏమిటో తెలిసి వచ్చింది. అంతేకాకుండా, లీగ్ మ్యాచుల తొలి దశలో పాకిస్తాన్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆఫ్రిదీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బౌలర్‌గా తన సత్తా చాటాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ మిగతా బౌలర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. లీగ్ దశలో ఆ విధమైన స్ఫూర్తిని ప్రదర్శించడం వల్లనే మిగతా బౌలర్లు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారని చెప్పవచ్చు. ఇదే ఆస్ట్రేలియాపై విజయానికి పాదులు వేసింది.

ఆఫ్రిదీ సహజసిద్ధమైన ఆటగాడిగా కనిపిస్తాడు. ఓడిపోతున్న దశలో మ్యాచును మలుపు తిప్పగల బ్యాటింగ్ సత్తాను అతను చాటగలడు. బంతిని బౌండరీలు దాటించడంలో అతను దిట్ట. శ్రీలంక ఆటగాడు దిల్షాన్‌తో, భారత బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌తో అతన్ని పోల్చవచ్చు. దక్కన్ చార్జర్ తరఫున హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ తరఫున ఆడినప్పుడు కూడా అతను ఆటలో ఆ కసినే చూపించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Afridi has entirely changed his Pakistan team. His team member and Pakistan test team skipper Misbah has said that Afridi succeed in achieving unity among team members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more