హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెండి కూడా ప్రాణాలు తీస్తుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Silver
వెండి కూడా ప్రాణాలు తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు ఆభరణాల కోసం హత్యలు చేయడం, మహిళల మెడల్లోంచి అవలీలగా లాక్కుపోవడం హైదరాబాదులో చూస్తున్నదే. తాజాగా, వెండి కూడా మహిళల పాలిటి శాపంగా మారినట్లు కనిపిస్తోంది. హైదరాబాదు సమీపంలోని శంషాబాద్ సమీపంలోని మదనపల్లిలో పద్మ అనే మహిళ కాళ్లు నరికి దొంగలు వెండి కడియాలు ఎత్తుకెళ్లారు. ఆమె ప్రస్తుతం హైదరాబాదులోని ఉస్మాయా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

హైదరాబాదు మార్కెట్లో బంగారం ధరనే కాదు, వెండి ధర కూడా విపరీతంగా పెరిగింది. శనివారం వెండి కిలో ధర ఒకేసారి 2,500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం వెండి కిలో ధర హైదరాబాదు మార్కెట్లో 72 వేల 600 పలుకుతోంది. గత కొద్ది కాలంగా వెండి ధర పెరుగుతూ ఉన్నది. దీనికి కారణం స్పష్టంగా తెలియడం లేదు గానీ బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో వెండి వైపు మధ్యతరగతి మహిళలు చూస్తుండడం ఒక కారణమని భావిస్తున్నారు. బంగారం పది గ్రాముల ధర 22,210 రూపాలు ఉంది. బంగారంతో పాటు వెండి కూడా ఇదే రీతిలో పెరుగుతూ వస్తోంది.

సాధారణంగా మహిళలు వెండి కడియాలు, వెండి పట్టగొలుసులు, వడ్డాణం ధరిస్తారు. అయితే, వెండి కంఠాభరణాలకు బంగారు పూత పూసి కూడా ధరిస్తున్నారు. వెండి ధర కూడా తక్కువేమీ కాకపోవడంతో దొంగలు మహిళలు ధరించే వెండి ఆభరణాలపై కూడా కన్నేసినట్లు భావించవచ్చు. అయితే, వెండి ధర ఇలాగే పెరుగుతుందని చెప్పలేమని, అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. బంగారం ధరలు పెరగడం వల్ల ప్రజలు వెండిని కొనడానికి ముందుకు వస్తుండడం దాని ధర పెరగడానికి కారణమని అంటున్నారు.

English summary
It seems silver ornaments are also posing posing threat to women. One lady's legs were chopped at Samshabad near Hyderabad for silver ornaments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X