వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావుకు ఉండవల్లి దెబ్బ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కొట్టిన దెబ్బ ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు బాగానే తగిలినట్లుంది. మార్గదర్శి చిట్స్ ఫండ్స్‌లో అక్రమాలు జరిగాయని, కస్టమర్లను నిబంధనలను ఉల్లంఘించి మోసం చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా రామోజీపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మార్గదర్శి కస్టమర్లకు డబ్బులు చెల్లించే పనిలో ఆర్థిక వనరుల సర్దుబాటులో రామోజీ రావు పడినట్లు చెబుతున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఆయన ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలోనే ఈనాడు టెలివిజన్ చానెళ్లను సోనీకి విక్రయించే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఈనాడు గ్రూపు సంస్థల్లో రియలన్స్ అంబానీ పెట్టుబడులు పెట్టారని, చంద్రబాబు ప్రభావితం చేసి ఈ పెట్టుబడులు పెట్టించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా ఆరోపణలు చేస్తూ వచ్చింది.

తాజాగా, రామోజీ రావు తన ఈటీవి టెలివిజన్ చానెళ్లను సోనీకి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. రెండు సంస్థల మధ్య 2250 కోట్ల నుంచి 2400 కోట్ల రూపాయల మధ్య ఈ డీల్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ డీల్‌లో న్యూస్ చానెల్ ఈటివీ2 ఉండదని చెబుతున్నారు. ఈ డీల్ సోనీ - ఎంఎస్ఎం ప్రాంతీయ మార్కెట్లో బలపడేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

జెమినీ, జీ, మా వంటి ఎంటర్టైన్‌మెంటు చానెళ్లు తమ తమ డైలీ సీరియళ్లు, కొత్త రకం కార్యక్రమాల ద్వారా దూసుకుపోతున్నాయి. ఈ విషయంలో రామోజీరావుకు చెందిన ఈటీవీ చానెళ్లు వెనకబడిపోయాయని అంటున్నారు. దానికి కారణాలను అన్వేషించినా అందులోంచి బయటపడే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. దీంతో వాటిని సోనీకి విక్రయించేందుకు రామోజీ రావు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that Eenadu group chairman Ramoji Rao has decided to sell his ETV channels to mobilize funds for Margadarshi, which was hit by Congress MP Undavalli Arun Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X