వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా స్వరాజ్ వర్సెస్ కావూరి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao-Sushma Swaraj
భారతీయ జనతా పార్టీ లోకసభా పక్ష నేత సుష్మా స్వరాజ్ తెలంగాణపై మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రెండుగా చీలిపోయారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీ సుష్మా స్వరాజ్‌కు మద్దతుగా నిలవగా సీమాంధ్ర ఎంపీలు ఆమె ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కావూరి సాంబశివ రావు ఆమె ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. ఆమెపై పలుమార్లు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కోసం ఎంపీలు అందరూ రాజీనామా చేశారని ఆమె చెప్పినప్పుడు అందరూ రాజీనామాలు చేయలేదని హైదరాబాదుకు చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాజీనామాలు చేయలేదని చెప్పారు.

నాటి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను కూడా సుష్మా స్వరాజ్ తప్పుదోవ పట్టిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఇరు ప్రాంతాలకు ఇష్టం లేకుంటేనే విడిపోవచ్చునని నెహ్రూ చెప్పారని అన్నారు. సుష్మా స్వరాజ్ ఆ వ్యాఖ్యలను తప్పుదారి పెట్టిస్తోందన్నారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్న సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు లేచి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పలుమార్లు ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. స్పీకర్ మీరా కుమార్ వారిని వారించినప్పటికీ వారు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. సుష్మా మాట్లాడుతున్న ప్రతి అంశంపై కావూరి అప్పటికప్పుడే వివరణ ఇచ్చే ప్రయత్నాల కోసం లేచి నిలబడ్డారు.

ప్రతిపక్ష నేతగా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని పరోక్షంగా సుష్మా స్వరాజ్‌కు కావూరి సూచించారు. కాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంతగా నినాదాలు చేసినప్పటికీ ఆమె సావధానంగా తనంతట తాను ప్రసంగించడం విశేషం. అయితే మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ మాత్రం సుష్మా స్వరాజ్‌కు మద్దతుగా నిలబడ్డారు. సుష్మా చెబుతున్నట్లుగా కాంగ్రెసు తెలంగాణ ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఓ సమయంలో కావూరి, సర్వే మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బిజెపి వలె కాంగ్రెసు పార్టీ కూడా ఓ స్టాండ్ తీసుకోవాలని సర్వే సత్యనారాయణ తమ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత కావూరి ప్రసంగిస్తున్నప్పుడు బిజెపి ఎంపీలతో పాటు సర్వే సత్యనారాయణ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

English summary
MP Kavuri Sambasiva Rao obstructed BJP leader Sushma Swaraj in Parliament while she talking about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X