వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌కు అడ్డుగా నిలిచిన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
అమెరికా దాడి చేసిన సమయంలో ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన మహిళ ప్రస్తుతం పాకిస్తాన్ కస్టడీలో ఉంది. అమెరికా సీల్స్ ఆ మహిళ కాళ్లపై కాల్పులు జరిపి లాడెన్‌ను హతమార్చారు. లాడెన్‌ను పట్టుకుని కాల్చి చంపారని అతని 12 ఏళ్ల కూతురు చెబుతోంది. లాడెన్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన మహిళ యెమెన్‌కు చెందిన 27 ఏళ్ల అమల్ ఆల్ సదా. తన భర్తను కాపాడుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించింది.

ఇప్పుడు ఆ మహిళ ఉదంతం అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. నిజానికి, ఆ మహిళను అమెరికా నేవీ సీల్స్ తమతో పాటు తీసుకుని వెళ్లాలని అనుకున్నారని, ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో అది సాధ్యం కాలేదని వార్తలు వస్తున్నాయి. దశాబ్దం పాటు పాకిస్తాన్ లాడెన్‌కు రక్షణ కల్పించిందనే అభిప్రాయం అమెరికాకు కలుగుతోంది.

అమెరికా దాడి తర్వాత సదాను పాకిస్తాన్‌లోని రావల్పిండి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెను విచారించడానికి పాకిస్తాన్ అమెరికాకు అనుమతి ఇవ్వడం లేదు. కోలుకోగానే సదాను యెమెన్ పంపించి వేస్తామని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. ఆమెను యెమెన్ పంపించి వేస్తే చాలా విషయాలు లాడెన్‌కు సంబంధించి అమెరికాకు లభించకుండా పోతాయి.

పైగా, లాడెన్ గానీ, ఇతరులు గానీ ఆ భవనంలో అమెరికా నేవీ సీల్స్‌పైకి ఏ విధమైన కాల్పులు జరపలేదని తెలుస్తోంది. 13 గదులు గల భవనంలో ఆయుధాలు గానీ పేలుడు పదార్థాలు గానీ లేవు. దాన్ని బట్టి, లాడెన్ అమెరికా నేవీ సీల్స్‌పై దాడి చేసే అవకాశాలు లేవని అంటున్నారు. భవనంలో మాత్రం ముగ్గురి శవాలు పడి ఉన్నాయి. తాము ఆయుధాలను గానీ పేలుడు పదార్థాలను గానీ స్వాధీనం చేసుకోలేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.

English summary
Pakistan and America are locked in a diplomatic stand-off over the fate of Osama Bin Laden’s youngest wife. Amal al Sadah was at the centre of an international custody battle after Pakistan refused to give America permission to speak to her yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X