వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ గే క్లబ్ దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Homosexuality
హైదరాబాదులోని ఓ గే క్లబ్ వ్యవహారాన్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ బయటపెట్టింది. ఇది తీవ్ర దుమారం రేపింది. హైదరాబాదులోని గే కమ్యూనిటీ బండారాన్ని బయటపెడుతున్నామంటూ తెలుగు టీవీ చానెల్ టీవీ9 బుధవారం రాత్రి ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఓ రిపోర్టర్ గే సోషల్ నెట్‌వర్క్‌లోకి వెళ్తున్న స్టింజ్ ఆపరేషన్‌‍ను చానెల్ ప్రసారం చేసింది. అతను ఆ సైట్ నుంచి ఫోన్ నెంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని కనిపెట్టాడు. ఆ పోన్ నెంబర్లకు కాల్ చేసి వారి సంభాషణలను రికార్డు చేశాడు. నెట్‌వర్క్ నుంచి తీసి ఫోటోలతో పాటు ఆ సంభాషణలను టీవీ9 ప్రసారం చేసింది. వారు ఇష్టపడే లైంగిక భంగిమల గురించి కూడా ఆ రిపోర్టర్ అడిగాడు.

ఏడు నిమిషాల పాటు ప్రసారమైన ఆ వార్తాకథనంలో గే క్లబ్‌ల్లో రహస్య కెమెరాతో తీసిన ఫుటేజ్‌లను కూడా చానెల్ ప్రసారం చేసింది. వ్యక్తిగత విషయాల్లోకి చొరబడడమేనని, భారతదేశంలో దీని వల్ల తీవ్ర పరిణామాలుంటాయని, ఉద్యోగం పోవచ్చునని, కుటుంబంలో కలతలు చెలరేగవచ్చునని, అది మంచిది కాదని ప్రముఖ గే హక్కుల కార్యకర్త సునీల్ గుప్తా అభిప్రాయపడినట్లు ఓ ప్రముఖ చానెల్ తెలిపింది. ప్రకృతికి విరుద్ధమైన స్వలింగ సంపర్క కార్యకలాపాల్లో ఎక్కువ సాఫ్ట్‌వేర్ నిపుణులు, విద్యార్థులు, సంపన్న యువకులు మునిగితేలుతున్నారని టీవీ9 వార్తాకథనం వ్యాఖ్యానించింది.

టీవీ9 వార్తాకథనంలో ప్రసారమైన తన ఫొటోను తల్లిదండ్రులు చూస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తమ హక్కులకు భంగం కలిగించిన టీవీ9 క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గే హక్కల గ్రూపులు అంటున్నాయి.

English summary
TV 9, which broadcasts in Telugu ran a report last night that it says was intended as "an expose" on the gay community in Hyderabad. A "sting operation" showed a reporter logging onto a gay social networking site from where they located private profile information like phone numbers. They then phoned those people and recorded their conversations, which aired on TV along with profile photos lifted from the networking site. The questions the reporter asked included preferred sexual positions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X