వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుత్రుడి కోసం వనిత ఆక్రోశం, దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vanitha
ప్రముఖ సినీ నటి, సినీ నటుడు విజయ్ చందర్ కూతురు వనిత, ఆమె మాజీ భర్త ఆకాష్ మధ్య వారి తనయుడు గొడవ కొనసాగుతోంది. తాజాగా వనిత తన తనయుడిని తన వద్దకు పంపించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని ఆకాష్ ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. చెన్నై కోర్టు ఉత్తర్వుల మేరకు తన తనయుడిని తన వద్దకు వారానికి రెండు రోజులైనా పంపించాలని ఆమె డిమాండ్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆకాష్ నడుచుకోవడం లేదని తాను పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించాలని ఆమె ఆరోపించింది. అందుకే తాను నిరాహార దీక్షకు దిగానని ఆమె చెబుతోంది. తన కుమారుడిని తన వద్దకు పంపించే వరకు తాను దీక్షను విరమించనని హెచ్చరించింది.

అయితే భర్త ఆకాష్ వర్షన్ మరో రకంగా ఉంది. తన కుమారుడికి తల్లి వద్దకు వెళ్లడం ఇష్ట పడడం లేదని కౌన్సెలింగ్ ఇప్పించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ తల్లి వద్దకు పంపవద్దనే ఉద్దేశ్యం తమకు లేదని ఆకాష్ చెబుతున్నాడు. అయితే తన తనయుడిని చిత్ర హింసలకు గురి చేస్తూ తన వద్దకు రాకుండా చేస్తున్నారని వనిత ఆరోపిస్తోంది. మరో విషయం ఏమంటే వనిత తండ్రి విజయ్ చందర్ కూతుర్ వైపు కాకుండా అల్లుడు ఆకాష్ వైపు ఉండటం విశేషం. వనిత భర్త నుండి విడిపోయాక తన వద్దకు తనయుడిని పంపించక పోవడంతో ఆమె ఏడెనిమిది నెలల క్రితం కోర్టును ఆశ్రయించింది.

అయితే కొడుకుకు తల్లి వద్దకు వెళ్లడం ఇష్టం లేదని గమనించిన కోర్టు వారానికి రెండు రోజులు అంటే శని ఆదివారాలు తల్లి దగ్గరకు పంపించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్నాళ్లుగా ఆకాష్ - వనితల మధ్య తనయుడి కోసం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తనయుడి కోసం వనిత, ఆమె తండ్రి విజయ్ చందర్‌ ఆరు నెలల క్రితం సాక్షాత్తూ చెన్నై విమానాశ్రయంలోనే ప్రయాణీకుల ముందు గొడవ పడ్డారు. అయితే తన మాజీ భర్త సూచనల మేరకే
తన తండ్రి ఇలా తనతో గొడవకు దిగుతున్నారని ఆమె చెప్పారు.

English summary
Cine actor Vanitha take fast at her former husband Akash for her son. She take fast with police neglect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X