వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ పాల్ వాల్తాటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Paul Valthaty
పాల్ వాల్తాటి బుధవారం వరకు బహుశా చాలా మందికి తెలిసి ఉండడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపియల్ జట్టులో పాల్ వాల్తాటీ అనే క్రీడాకారుడు ఉన్నట్లు కూడా ఎవరూ గుర్తించి ఉండరు. చెన్నై సూపర్ కింగ్స్ చేసిన భారీ స్కోరుకు తన బ్యాట్‌తో అద్భుతమైన సమాధానం చెప్పి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు విజయాన్ని అందించిన తర్వాత అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓడిస్తుందని ఎవరికీ నమ్మకం లేదు. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడే కాదు, ఆట ప్రారంభం కావడానికి ముందు నుంచే చెన్నై సూపర్ కింగ్స్‌దే విజయమని అందరూ అనుకున్నారు. కానీ పాల్ వాల్తాటీ అందరి నమ్మకాన్ని వమ్ము చేశాడు.

ఐపియల్ 2011లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా వాల్తాటీ రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 189 పరుగులు సాధించడమనేదే తన ఆలోచనలో ఉందని వాల్తాటీ మ్యాచు ముగిసిన తర్వాత అన్నాడు. ఈ 27 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ 2006లో ముంబైలో జరిగిన వన్డేలో మాత్రమే ఆడాడు. అతను ఆడిన వన్డే మ్యాచు అదొక్కటే. ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్ వంటివారితో కలిసి అతను 2002లో ప్రపంచ కప్ అండర్ 19 పోటీల్లో ఆడాడు. న్యూజిలాండ్ పర్యటనలో కంటికి గాయమైంది. దాంతో అతని కెరీర్ ముగిసినట్లేనని భావించారు. రెండు మూడేళ్ల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ స్థితిలో పంజాబ్ ఐపియల్ జట్టులోకి వచ్చాడు.

వాల్తాటీ ఇప్పటి వరకు 12 ట్వంటీ20 మ్యాచులు మాత్రమే ఆడాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 70. పూణే వారియర్స్‌పై ఓటమి పాలైన పంజాబ్ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయాన్ని సాధించి పెట్టాడు. వాల్తాటీ చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచులో 63 బంతుల్లో 120 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఐపియల్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. అంతకు ముందు బ్రెండన్ మెక్‌కులం 158 పరుగులు, మురళీ విజయ్ 127 పరగులు చేశారు. చెన్నైతో జరిగిన మ్యాచులో వాల్తాటీ 19 ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. వాల్తాటీ ఒక సందర్భంలో 21 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొంత మందగించాడు. వాల్తాటీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కూడా అందుకున్నాడు.

English summary
Little known Paul Valthaty slammed an incredible century to lead Kings XI Punjab to the biggest successful chase of the Indian Premier League. That it came against a formidable Chennai Super Kings, who are the defending champions, made it stand out further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X