వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ సాంబశివుడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sambasivudu
కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడు నల్లగొండ జిల్లా దాసిరెడ్డిగూడెం గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లారు. ఆయన 16 ఏళ్లపాటు ఆ ఉద్యమంలో పనిచేసి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మావోయిస్టు కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన 2009లో అప్పటి హోం మంత్రి కె. జానా రెడ్డి సమక్షంలో ప్రభుత్వానికి లొంగిపోయారు. లొంగిపోయిన సమయంలో సాంబశివుడిపై దాదాపు 88 కేసులున్నాయి. వీటిలో శాసనసభ్యుడు నర్సిరెడ్డి హత్య కేసు, ఎస్పీ లడ్హాపై దాడి కేసు ఉన్నాయి. సాంబశివుడిపై ఉన్నవాటిలో 15 హత్య కేసులు.

అప్పటి పీపుల్స్‌వార్ ఇప్పటి మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు సాంబశివుడు సంచలనాలకు ప్రతీకగా నిలిచాడు. ఆయన సోదరుడు కూడా నక్సలైట్ ఉద్యమంలో పనిచేశాడు. సోదరుడు రాములు గతంలో పోలీసులకు లొంగిపోయారు. సాంబశివుడిపై ఉన్న మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఒక కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్నాడు. పలు తెలంగాణ సభల్లో ఆయన పాల్గొన్నారు.

ఆ తర్వాత కొంత కాలానికి ఆయన కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. తెరాసలో నల్లగొండ జిల్లా భువనగిరి ఇంచార్జీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తూ వస్తున్నారు. అయితే, గతంలో పీపుల్స్ వార్‌లో పని చేసిన నయీంకు సాంబశివుడికి వ్యక్తిగత వైరం ఉన్నట్లు తెలుస్తోంది. నయీం కూడా భువనగిరి ప్రాంతానికి చెందినవాడే. పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ) నాయకులను, సానుభూతిపరులను బయటకు వచ్చిన తర్వాత లక్ష్యం చేసుకుని హత్యలకు పూనుకున్నాడని, అందుకు నయీం ఓ ముఠాను తయారు చేసుకున్నాడని అంటారు.

నయీం నుంచి తన కుమారుడు సాంబశివుడికి ప్రాణహాని ఉందని సాంబశివుడి తల్లిదండ్రులు గతంలో ఆరోపించారు. నయీం నుంచి తనకు ప్రాణహాని ఉందని సాంబశివుడికి కూడా తెలుసంటారు. అయితే, నయీం పక్షవాతంతో బాధపడుతూ పడక మీదనే ఉంటున్నాడని సాంబశివుడికి తెలిసి, స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాంబశివుడి హత్య జరిగిందని అంటున్నారు. కాగా, భూ వివాదాలు కూడా సాంబశివుడి హత్యకు కారణమై ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది.

English summary
TRS leader Sambasivudu alias Konapuri Ilaiah belongs to Dasireddygudem of Nalgonda district. Inspired by naxalite movement he joined in Earstwhile People's war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X