వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై మోత్కుపల్లి అసంతృప్తి వెనుక?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై ఆ పార్టీ సీనియ్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు అసంతృప్తి వెనుక నల్గొండ జిల్లాలోని బస్సుయాత్ర రోడ్డు మ్యాప్ మార్పే కారణమా అంటే ఆది ఓ బూచీ మాత్రమే అని తెలుస్తోంది. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుకు పిఎసి, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవులు అని సమాచారం. తెలంగాణ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేసిన సమయంలో నాగంపై ధ్వజమెత్తిన వారిలో మోత్కుపల్లి ముందుంటారు. నాగంను విమర్శించడం ద్వారా బాబు ఆశీస్సులతో నాగం వెళ్లి పోవడంతో ఖాళీ అయిన పిఎసి పదవిని, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవిని ఆశించారు.

కానీ ఫోరం కన్వీనర్‌గా ఎర్రబెల్లి దయాకర రావును వరించింది. అప్పటి నుండే మోత్కుపల్లిలో అసంతృప్తి గూడు కట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే పిఏసి చైర్మన్ పదవి ఖాళీ ఉండటంతో ఆయన మరికొన్నాళ్లు ఓపిక పట్టినట్లు తెలుస్తోంది. పిఏసి చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్ర తర్జన భర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పదవికి మోత్కుపల్లి నరసింహులు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొత్తకోట దయాకర రెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి, నాగం వర్గం హరీశ్వర్ రెడ్డిని పరిశీలించినట్లు తెలుస్తోంది. రేవూరి, కొత్తకోట, రావులలో ఎవరికో ఒకరికి ఇస్తే మిగిలిన వారు నాగం వైపు వెళతారని పార్టీలో ఊహాగానాలు వస్తున్నట్టు సమాచారం.

అలాకాకుండా నాగం వర్గం హరీశ్వర్ రెడ్డికి పిఎసి పదవి ఇవ్వడం ద్వారా తమ వైపు తీసుకు రావాలనీ బాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలా అయితే రేవూరి, కొత్తకోట, రావుల తదితరులు నాగం వైపు చూస్తున్నారనే అనుమానం ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు పిఎసి పదవిని భర్తీ చేయకుండా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల తనకు ఎలాగు పిఎసి పదవి దక్కదనే ఉద్దేశ్యానికి మోత్కుపల్లి వచ్చాడని అందుకే బస్సుయాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేసి తన అసంతృప్తి వ్యక్తం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
It seems, Motkupalli Narasimhulu is very angry with TDP chief Nara Chandrababu Naidu for PAC post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X