వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బోల్తా, పారిన చంద్రబాబు పాచిక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేసిన పాచిక పారినట్లే ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెంద్రబాబు గట్టిగా చెబుతున్న మరుక్షణం నుంచి జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల శిబిరం చెల్లాచెదురవుతూ వస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఓటింగు జరిగేనాటికి జగన్ వెంట ఉండేది ఎవరనేది కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని బలపరచాల్సిన అనివార్యతలో జగన్ పడ్డారు. కర్రు చూసి వాత పెట్టినట్లు చంద్రబాబు జగన్‌ను దెబ్బ తీయడానికి అవిశ్వాసం తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డారు. అవిశ్వాస తీర్మానాన్ని బలపరచాలని వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శానససభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. అనర్హత వేటు పడినా సరే, దాన్ని బలపరచాల్సిందేనని తన వర్గం ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు గురువారం ఏర్పాటైన జగన్ వర్గం సమావేశానికి పట్టుమని పది మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో కూడా చివరి వరకు ఎంత మంది ఉంటారనేది కూడా అనుమానంగానే ఉంది. ఆరుగురు మాత్రమే జగన్ వెంట ఉండే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఆరుగురు కచ్చితంగా కాంగ్రెసుకు ఇష్టం లేనివారై ఉంటారనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం రాత్రి గుంటూరు ఓదార్పుయాత్రలో జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆశలు నీరుగారిపోయినట్లు ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది.

అదును చూసి దెబ్బ కొట్టేందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈ సందర్భాన్ని ఎంచుకున్నారని ఆయన భావిస్తున్నట్లు తెలిసిపోతూనే ఉంది. ఈ సమయంలో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలనే చంద్రబాబు యోచనలో కుట్ర ఉందని ఆయన విమర్సించారు. తన శానససభ్యులు డిస్‌క్వాలిఫై కావడానికే ఆయన అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎత్తులు జిత్తులు ఉంటాయనే విషయం జగన్‌కు తెలియంది కాదు. కానీ, ప్రత్యర్థులు కూడా తనకు అనుకూలంగా వ్యవహరించాలనే ఉద్దేశం ఆయన మాటల్లో కనిపిస్తోంది. తన వెంట నడిచే శానససభ్యులు అనర్హతకు కూడా సిద్ధపడి అవిశ్వాసానికి మద్దతిస్తారని ఆయన అన్నారు. వారు ఎంత మంది ఉంటారనేది కూడా ఆయనకు అనుమానంగానే ఉంది. అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడారని అనుకోవచ్చు. ఏమైనా, జగన్ బోల్తా పడినట్లు కనిపిస్తున్నారు.

English summary
It is clear that YSR Congress party president YS Jagan camp MLAs are fissled out in the wake of No - confidence motion to be proposed on Kiran government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X