వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్, సెహ్వాగ్ ఫ్లాప్, భార్యల బ్యాటింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Anjali Tendulkar
భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్‌లో విఫమైన నేపథ్యంలో వారి భార్యలు భవిష్యత్తు కోసం బ్యాటింగ్ ప్రారంభించారు. టెండూల్కర్ భార్య అంజలి, సెహ్వాగ్ భార్య ఆర్తి కలిసి ఓ బిజినెస్ వెంచర్‌లోకి ప్రవేశించారు. భారత జట్టు వీడియో అనలిస్టు సుబ్రహ్మణ్యన్ రామకృష్ణన్ స్థాపించిన చెన్నైలోని స్పోర్ట్స్ మెకానిక్స్ కంపెనీలో వారిద్దరు మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

తమకు ఐకాన్స్ మద్దతు లభిస్తోందని రామకృష్ణన్ ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో అన్నారు. సమయం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. క్రికెటర్ల భార్యలతో బిజినెస్ వెంచర్‌ను ఎలా ప్రారంభించారనే విషయాన్ని వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఈ సంస్థలో అంజలికి 35 శాతం, ఆర్తికి 25 శాతం, రామకృష్ణన్‌కు 38 శాతం వాటాలున్నాయి.

రామకృష్ణన్ తమిళనాడు జూనియర్ క్రికెట్ జట్టులో ఆడాడు. అదే విధంగా 13 ఏళ్ల పాటు ఇండియన్ బ్యాంక్ జట్టుకు నేతృత్వం వహించారు. దశాబ్దం క్రితమే ఆయన వీడియో అనాలిసిస్ సోల్యూషన్స్‌ను ప్రవేశపెట్టారు. పెర్మార్మెన్స్ అనలిస్టుగా జాన్ రైట్ 2003లో ఆహ్వానించినప్పుడు రామకృష్ణన్‌కు పెద్ద బ్రేక్ లభించింది.

స్సోర్ట్స్ మెకానిక్స్‌లో 30 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పాఠాశాల, కాలేజీ స్థాయి క్రీడాకారులు. నిరుడు రూ. 3 కోట్ల రూపాయల టర్నోవర్ మాత్రమే సాధించింది. దాన్ని వంద కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా రామకృష్ణన్ నడిపించడానికి సమాయత్తమవుతున్నారు. విజ్యువల్ కోచింగ్ మెథడ్స్ పెరగడంతో స్పోర్స్ట్ మెకానిక్స్ వ్యాపారం పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
While their husbands have been forging big partnerships on the cricket field over the years, Anjali Tendulkar and Aarti Sehwag have stitched together one of their own in a business venture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X