వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స సత్తిబాబు గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గరంగ గరంగా ఉన్నట్లు అర్థమవుతోంది. తనను తగ్గించడానికి కిరణ్ కుమార్ రెడ్డి తెర వెనక ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లు ఆయన భావిస్తున్నట్లు సమాచారం. జోడు పదవుల వ్యవహారంపై, తెలంగాణకు పిసిసి అధ్యక్ష పదవిపై కొంత మంది తెలంగాణ శానససభ్యులు పార్టీ అధిష్టానం చుట్టూ తిరగడం వెనక ముఖ్యమంత్రి హస్తం ఉన్నారని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇందులో మంత్రి పదవికి కోత పెట్టాలని ముఖ్యమంత్రి తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవి సీమాంధ్రకు చెందినవాడు కావడం వల్ల తెలంగాణకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా తెలంగాణ శానససభ్యులు కొంత మంది ముందుకు తెచ్చారు.

అదే సమయంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో కూడా తనను ఇరకాటంలో పెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తోందని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్లనే ఇటీవల ఆయన ఆసహనంతో కూడిన ప్రకటన చేశారని అంటున్నారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఆయన అందుకే అన్నారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనే విషయం అధిష్టానానికి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అన్నారని చెబుతున్నారు.

పైగా, ఉప ఎన్నికల విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి బొత్స కన్నా ముందే అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు విషయంలో ఆయన అన్నీ చేయదలుచుకున్నట్లు అర్థమవుతోంది. నామ్ కే వాస్తేగా బొత్సను భాగస్వామిని చేసి తానే అంతా నడిపించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ శుక్రవారం చాలా నీరసంగా మాట్లాడారని అంటున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం లభించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం సరిగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ - పథకాల ప్రచారం ముమ్మరంగా సాగాలంటే ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు ప్రోత్సాహం అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీన్నిబట్టి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

English summary
It is said that PCC President Botsa Satyanarayana is not happy with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X