వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐపై ఐఎఎస్ అధికారుల మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI Logo
మూడు ఉన్నత స్థాయి కేసుల్లో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపై ఐఎఎస్ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. సిబిఐ మంత్రులను వదిలేసి ఐఎఎస్ అధికారులను వేధించే పనికి పూనుకుందని వారు గుర్రుమంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసుల్లో సిబిఐ ఐఎఎస్ అధికారులను విచారణ నిమిత్తం పిలుస్తుండడమే కాకుండా కొంత మంది అధికారులను అరెస్టు కూడా చేసింది. శ్రీలక్ష్మిని గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేయగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఇద్దరు ప్రస్తుత ఐఎఎస్ అధికారులను నిందితులుగా చేర్చింది. వీరిలో హోం కార్యదర్శి బిపి ఆచార్యను అరెస్టు చేసింది. టిటిడి ఇవో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నిందితుడిగా చేర్చింది. గురవారం ఎల్వీ సుబ్రహ్మణ్యం కుమారుడి పెళ్లి జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని పెళ్లికి వెళ్లిన పలువురు అధికారులు ఊరడించే ప్రయత్నం చేశారు. దాదాపు 16 మంది ఐఎఎస్ అధికారులను సిబిఐ విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది గురువారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల పట్ల హైదరాబాదులోని సిబిఐ అనుసరిస్తున్న తీరును ఆయన సిబిఐ బాస్‌, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిబిఐ తమను వేధిస్తోందంటూ పలువురు బ్యూరోక్రాట్లు ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తూ లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వోక్స్ వ్యాగన్ కేసు నుంచి బయటపడిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సిబిఐ ఎమ్మార్ కుంభకోణం కేసు చార్జిషీట్‌లో నిందితుడిగా చేర్చింది.

కుమారుడి పెళ్లి సమయంలో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యాన్ని తీవ్రమైన సంకట స్థితికి నెట్టినట్లు చెబుతున్నారు. పెళ్లికి వచ్చినవారు దంపతులను ఆశీర్వాదాలు అందించడాని కన్నా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఓదార్చడానికే సమయం పెట్టాల్సి వచ్చింది. ఈ విషయంపై బ్యూరోక్రాట్లు సిబిఐని ప్రశ్నించగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కుమారుడి పెళ్లి ఉన్నట్లు తమకు తెలియదని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చెప్పినట్లు సమాచారం. ఇదిలా వుంటే, ఐఎఎస్ అధికారులు అజయ్ మిశ్రా, రమాకాంత్ రెడ్డిలను సిబిఐ ప్రశ్నించింది. మరింత మంది ఐఎఎస్ అధికారులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
he state bureaucracy has taken serious note of the CBI including fellow IAS officers B.P. Acharya (pri-ncipal home secretary) and L.V. Subrahmanyam (executive officer, TTD) in the chargesheet in Emaar scam without prior permission from Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X