వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ పార్టీలు నో: వ్యూహం మార్చిన చమన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chaman
స్వర్గీయ తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడు చమన్ ఇకపై బిసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించనున్నారట. రాజకీయ పార్టీలలో చేరేందుకు ఆయా పార్టీలలోని నేతల నుండి చమన్‌కు చుక్కెదురయిందట. దీంతో అతను పార్టీల మాట పక్కన పెట్టి బిసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని చూస్తున్నారట.

అందులో బాగంగానే బిసి యునైటెడ్ ప్రంట్ నిర్వహించిన బిసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేసానికి చమన్ హాజరైనట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బిసి నేత పాలూరి రామకృష్ణయ్య చమన్‌కు పలు సూచనలు చేశారట. చమన్ అంతకుముందు కాంగ్రెసు, టిడిపిలలో చేరేందుకు ప్రయత్నించారట. చమన్‌ను పార్టీలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారట.

అయితే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి రఘువీరా రెడ్డి, ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వంటి నేతలు చమన్ చేరికను వ్యతిరేకించారట. దీంతో కిరణ్ వెనక్కి తగ్గారని సమాచారం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నించారట. అయితే పరిటాల సునీతతో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా... చమన్‌కు బాబు స్పష్టమైన హామీ ఇవ్వలేక పోయారని అంటన్నారు. అంతేకాకుండా ఇటీవల చమన్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్‌ను పలువురు వెనక్కి పంపంచారు.

దీంతో చమన్ రాజకీయంగా కాకుండా బిసి నేతగా ఎదగాలని భావించారని అంటున్నారు. ఇటీవల నిర్వహించిన బిసి, ఎస్సీ, ఎస్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో చమన్ ప్రత్యక్షమయ్యారు. ఈ సమావేశంలో నేతలు సామాజిక శక్తులను ఒకే తాటిపైకి తీసుకు వచ్చే బాధ్యతను అప్పగించారు. దీంతో బిసి ఉద్యమంలోకి ఇక చమన్ దూకనున్నారనే విషయం అర్థమైపోయిందని అంటున్నారు.

English summary
It is said that Chaman, who was main follower of Paritala Ravi will play key role in BC agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X