వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుస వివాదాల్లో పవన్‌కల్యాణ్: చిక్కుల్లో చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను తరుచూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. పవన్ వివాదాలు కాస్త ఆయన సోదరుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని చుట్టుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం విడుదలైన పవన్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ఓ వైపు తెలుగుదేశం, మరోవైపు తెలంగాణవాదులు పవన్ చిత్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణవాదుల ప్రతిఘటనకు తలవంచిన చిత్ర దర్శకుడు, నిర్మాత వ్యతిరేకంగా ఉన్న వాటిని కట్ చేసేందుకు అంగీకరించారు.

అదేవిధంగా తమ చిత్రంలో ఏ పార్టీకి, ఏ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా లేదని వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఈ చిత్రంలో తెలంగాణకు వ్యతిరకంగా సన్నివేశాలు ఉన్నాయంటూ శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా తెలంగాణవాదులు రోడ్డెక్కారు. హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై నిప్పులు కక్కారు. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అదే సమయంలో తెలంగాణవాదులు చిరంజీవి పైనా విమర్శలు గుప్పించారు.

తెలంగాణకు చిరంజీవి రాజకీయంగా మోసం చేస్తే పవన్ కల్యాణ్ సినిమాల ద్వారా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడ్డారు. చిరంజీవి సమైక్యావాదిగా ముద్రపడిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా పవన్ పెళ్లి వివాహం చిరంజీవినీ తాకింది. సినిమాలలో అభిమానులకు సూక్తులు వల్లించే చిరంజీవి మొదట తన తమ్ముడి తీరుపై స్పందించాలని ఇతర పార్టీలు ప్రశ్నించాయి.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ మెగాస్టార్ పైన తమ్ముడు పవన్ కల్యాన్ డైలాగ్‌నే ఉపయోగించింది. 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు నేతల బట్టలూడదీసి కొడతానని చెప్పిన ప్రజారాజ్యం ఇప్పుడు కాంగ్రెసులో ఎలా విలీనం అయిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. విలీనంపై స్పందించిన పలు సందర్భాలలో టిడిపి పవన్ డైలాగ్‌నే చిరు పైన ఉపయోగించడం గమనార్హం.

చిరంజీవి స్వయంగా ఎలాంటి విమర్శలు ఎదుర్కోనప్పటికీ తన సోదరుడు పవన్ కల్యాణ్, కూతురు శ్రీజ, బావమరిది అల్లు అరవింద్‌ల కారణంగా రాజకీయ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అరవింద్ టిక్కెట్లు అమ్ముకున్నారనే విమర్శలు అప్పుడు సంచలనం రేపాయి. కూతురు శ్రీజ ప్రేమ వివాహం కూడా చిరంజీవిని విమర్శించేందుకు రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి. మరోవైపు పవన్ కల్యాన్ సినిమాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. గతంలో గబ్బర్ సింగ్, పులి సినిమాలు కూడా పోలీసుల, తెలంగాణవాదుల నుండి నిరసనలు ఎదుర్కొన్నాయి.

English summary

 It is said that Congress MP Chiranjeevi is facing problems with his brother Pawan Kalyan's film like Camaramen Ganga Tho Rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X