హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిర్లా మందిర్ సమీపంలో గుప్త నిధులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Birla Mandir
హైదరాబాదులోని బిర్లా మందిర్ పరిసరాల్లో భారీగా గుప్త నిధులు ఉన్నాయన్న వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. వెంటనే పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. ఆదివారం నుండి తవ్వకాలు జరిపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సచివాలయం సమీపంలో విద్యారణ్య పాఠశాల ఉంది. గతంలో వనపర్తి రాజావారి నివాసం దానికి సమీపంలోనే ఉండేది. మూడేళ్ల కిందట పాఠశాల ఆవరణలోని మైదానం అంచున బిర్లా దేవాలయం గుట్ట కింద ఒక గోడ నిర్మిస్తుండగా పునాదుల కింద భారీ నిర్మాణాలు కనిపించాయట. విద్యారణ్య పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్న కోల్ ఇండియా మేనేజర్ సీతారామరాజు ఆ విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత సొరంగంలా కనిపించే అంతర్గత నిర్మాణాల 14 మెట్లు దిగి ఆయన పరిశీలించారు.

అక్కడ భూగర్భంలో భారీ భవన నిర్మాణం, దానికి ఇనుప తలుపులు సైతం ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు చెప్పారు. ఆ తలుపులకు చిన్న రంధ్రం ఉందని, అందులో గుప్త నిధులు ఉన్నట్లు తాను చూశానని ఆయన తెలిపారు. తర్వాత పలు దఫాలుగా ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆరు నెలలుగా ఆయన ఈ విషయాలపై వివిధ రకాలుగా ఆరా తీశారు. పురావస్తు శాఖ అధికారుల్ని కలిసి వారికి ఈ విషయాలపై చెప్పారు. వారు అంతగా సీరియస్‌గా తీసుకోక పోవడంతో, సీతారామరాజు మిత్రులతో కలిసి పురావస్తు శాఖ డైరెక్టర్ చిన్నా రెడ్డికి తెలిపారు. దీంతో చిన్నా రెడ్డి దీనిపై విచారణ ప్రారంభించారు. గుప్త నిధులు ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
The news that there is hidden treasure in the heart of the city near Bitla Mandir has created sensation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X