ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ మొఘల్ గోల్డ్, ఇక్కడ నిజాం వెండి నాణేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Golconda Fort
కర్నాటకలో మొఘలుల కాలం నాటి బంగారు నాణేలు బయటపడితే, ఆదిలాబాద్ జిల్లాలో నిజాం కాలం నాటి వెండి నాణేలు బయల్పడ్డాయి. రెండు చోట్లా ఇంతకు ముందే అవి తవ్వకాల్లో లభ్యమవగా, ఆ సంగతి బయటపడింది మాత్రం శనివారమే అని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా పరిధిలోని సండూరు పట్టణంలో మార్చి ఏడవ తేదిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం గుంత తవ్వుతుండగా పురాతన కాలం నాటి ఆభరణాలు బయటపడ్డాయి. దీనిపై సమాచారం అందడంతో స్థానిక పోలీసులు ఇంటి యజమాని, తవ్విన కూలీలపై కేసు నమోదు చేసి, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. శనివారం ఉదయం స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ వ్యక్తి ఇంటిలో సోదాలు చేసి 720 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాణేలపై ఉన్న గుర్తుల ఆధారంగా అవి మొఘలుల కాలంవిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు.

ఒక్కో బంగారు నాణెం 3.2, 3.3 గ్రాముల బరువున్నాయి. మొత్తం 214 నాణేలతో పాటు 110 గుండ్లు, 6 పతకాలు, 2 బుగుడులు, ఒక వెండి నాణెం ఉన్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా పాత పంబాపూర్ శివారులో సమాధి కోసం తవ్వుతుండగా నిజాం కాలం నాటి 244 వెండి నాణేలు బయటపడ్డాయి. గత ఫిబ్రవరి 25న అక్కడ సమాధి నిర్మాణం కోసం పాత పునాదిని తవ్వుతుండగా నిజాం కాలం నాటి వెండి నాణాలు బయటపడ్డాయి. వాటిని పంబాపూర్ గ్రామానికి చెందిన వారు ఇంటికి తీసుకెళ్లారు. విషయం ఈ నెల ఇరవయ్యో తేదిన తహసీల్దార్‌కు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారివద్ద నుంచి 244 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.1,16,175 మేరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

English summary

 Officers found hidden treasure in Karnataka and Adilabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X