వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హాఫ్' సెంచరీస్ మిస్: సచిన్ అస్త్రసన్యాసం చిక్కుముడి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన 23 ఏళ్ల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఆదివారం హఠాత్తుగా గుడ్ బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలుసుకున్న మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాస్టర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని శ్రీకాంత్ అన్నాడు. అయితే సచిన్ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎంతో మానసిక ఒత్తిడి ఉండి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సచిన్ టెండుల్కర్‌లా సుదీర్ఘ క్రికెట్ అడిన వారు లేరు. సచిన్ సాధించిన రికార్డులు ఎవరూ సాధించలేదు. సచిన్ కీర్తి కేవలం భారత్ వరకే పరిమితం కాదు. సచిన్ సాధించిన రికార్డులలో ఎన్ని తిరగ రాయలేనివని ఎందరో అభిప్రాయం. కొందరు కొన్ని రికార్డులు సృష్టించవచ్చు. కానీ సచిన్‌లా ఎన్నో రికార్డులను తమ పరం చేసుకున్న వారు మాత్రం లేరు. అంతేకాదు సచిన్ సాధించిన రికార్డుల్లో కొన్నింటిని ఎవరో ఒకరు తిరగరాస్తుండవచ్చు. కానీ అన్ని రికార్డులను ఒకరే తిరగ రాయడం మాత్రం అసాధ్యం!

463 వన్డేలు ఆడిన సచిన్ 18,426 పరుగులు చేశాడు. 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 44.86 సగటు. అత్యధిక స్కోరు 200 నాటౌట్, దక్షిణాఫ్రికాపై. 16 ఏళ్లకే క్రికెట్ కేరీర్‌లో అడుగు పెట్టిన సచిన్ తన తొలి మ్యాచ్‌ను 1989లో పాకిస్తాన్ పైన ఆడాడు. చివరి మ్యాచ్ కూడా పాక్ పైనే మార్చి 18, 2012న ఆడాడు. ఇప్పటికే ట్వంటీ20లకు గుడ్ బై చెప్పిన సచిన్ వన్డేలకు ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక మానసిక ఒత్తిడే కారణం కావచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వన్డేలలో 49 సెంచరీలు చేసిన సచిన్ 50వ సెంచరీ చేయాలనే భావనతో ఉండి ఉంటాడని అంటున్నారు. అయితే ఇటీవల వరుసగా వైఫల్యం చెందుతున్న నేపథ్యంలో సచిన్ పైన సీనియర్ల నుండి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ వంటి వారు అండగా కూడా నిలబడ్డారు. యువకులకు అవకాశం కల్పించాలంటూ పలువురి నుండి ఒత్తిళ్లు, కీలక సమయాల్లో వరుసగా వైఫల్యం చెందుతుండటం, అదే సమయంలో 50వ సెంచరీ ఒత్తిడి తదితర అంశాలు సచిన్‌ను మానసికంగా వేధించి ఉంటాయని అంటున్నారు.

వయస్సు ప్రభావం మాత్రమే కాకుండా.. ఒత్తిళ్లు కూడా సచిన్ ఇటీవలి ఆట పైన ప్రభావం చూపించి ఉంటాయని అంటున్నారు. ఇలా సీరియస్‌గా ఒత్తిళ్లు వస్తున్న సమయంలో 50వ వన్డే సెంచరీ చేయాలనుకున్నప్పటికీ దానిపై దృష్టి కేంద్రీకరించలేక తప్పుకోవాలని భావించి ఉంటారని అంటున్నారు. పాక్ సిరీస్ కోసం సచిన్‌ను బిసిసిఐ సంప్రదించిన సమయంలోనే అతను తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

సెలక్టర్లు కూడా సచిన్‌కు ఎన్నిక చేయడం కష్టమని చెప్పి ఉంటారనే వార్తలు వస్తున్నాయి. సచిన్ కోసం జట్టు నుండి కూడా ఎలాంటి ఒత్తిళ్లు రాకపోవచ్చునని అంటున్నారు. సచిన్ భారత క్రికెట్‌కు అత్యున్నత సేవలు అందించారనేది అందరూ ఒప్పుకుంటారు. అదే సమయంలో యువకులకు అవకాశం ఇవ్వకుండా అలాగే కొనసాగడాన్ని కూడా ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారనే వాదన ఉంది. పలువురు క్రికెటర్లు సచిన్ రిటైర్మెంట్‌తో యువకులకు అవకాశం వస్తుందని భావిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి సచిన్ హఠాత్ నిర్ణయం ఓ చిక్కుముడే అంటున్నారు.

English summary
Indian batting legend Sachin Tendulkar announces retirement from the one day format of the game.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X