వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ క్రికెట్ దేవుడాయె: ఏమైనా అంటే...

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
ముంబై: టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ తెల్ల ఏనుగుగా మారాడు. టీమిండియాకు అతను భారంగా మారినట్లే కనిపిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో యువ క్రికెటర్లు సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నారు. వారు టెస్టు జట్టులోకి రాకుండా సచిన్ టెండూల్కర్ కొనసాగింపు కూడా అడ్డం పడుతోంది. యువ క్రికెటర్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుని మంచి పనే చేశారు.

కానీ, రికార్డుల మీద రికార్డులు సాధించిన సచిన్ టెండూల్కర్‌కు మాత్రం తాను రిటైర్ కావాల్సిన సమయం రాలేదని అనిపిస్తోంది. అది ఒక రకంగా విడ్డూరమైన విషయమే. సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాట్స్‌మన్ జట్టు ఆదుకోవాల్సింది పోయి అతన్నే జట్టు ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టు విజయాల మీద విజయాలు సాధిస్తుంటే అతను పరుగులు చేసినా, చేయకపోయినా పెద్దగా పట్టించుకునే వారుండరు. ఏ వైపు ఛతేశ్వర్ పుజారా వంటి యువకుడు ఇంగ్లాండు బౌలింగుకు ఎదురొడ్డి నిలబడుతుంటే సచిన్ టెండూల్కర్ వంటి దిగ్దజం చేతులెత్తేసి బ్యాట్‌ను కూడా మోయలేనట్లు వ్యవహరించడం బాధాకరంగానే ఉంటుంది.

అహ్మదా‌బాద్ టెస్టు సరే, తన సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో కూడా అతను చేతులెత్తేసి తనకేమీ పట్టనట్లు వ్యవహరించాడు. జట్టు ఆదుకునే స్థితిలోనే కాదు, తనను తాను ఆదుకునే స్థితిలో కూడా ఉన్నట్లు సచిన్ కనిపించడం లేదు. అహ్మదాబాద్ టెస్టులో 13 పరుగులే చేసిన మాస్టర్ ముంబై టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిదేసి పరుగుల చొప్పున చేసి నిరాశపర్చాడు. సచిన్‌ను విమర్శించిన మాజీ క్రికెటర్లను ఆయన అభిమానులు తప్పు పడుతున్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా మారిపోయాడు. అతన్ని ఏవరూ ఏమీ అనలేని స్థాయికి చేరుకున్నాడు. ఏం చేస్తాం, మరి...

ఈ స్థితిలోనే సచిన్ భవిష్యత్ ప్రణాళికేంటో అతణ్ని అడిగి తెలుసుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సెలక్టర్లకు సూచిస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్న సీనియర్ బ్యాట్స్‌మన్ సచిన్‌పై మరోసారి విమర్శలు చెలరేగడంతో ఆయన ఆ విధంగా స్పందించారు. 'సచిన్ ఏన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. అయితే ఇప్పుడతని ఫామ్ విమర్శలకు తావిస్తోంది. పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. రిటైర్మెంట్‌పై సచినే ఓ నిర్ణయం తీసుకోవాలని, అయితే అతని భవిష్యత్ ప్రణాళిక ఏమిటో ముందుగా సెలెక్టర్లు తెలుసుకోవాలని, దీనిపై అతనితో చర్చించాలని సునీల్ గవాస్కర్ అన్నాడు.

బ్యాటింగ్‌పై ఇతరులకు సలహాలు ఇవ్వాల్సిన సచిన్ టెండూల్కర్ తాను వరుసగా అవుటైన తీరును సరిచేసుకోకపోవడం ఒక విధంగా ఆశ్చర్యకమే. లెఫ్ట్ ఆర్మ్ స్నిన్నర్స్ చేతిలో అతను ఇప్పటి వరకు 24 సార్లు అవుటయ్యాడు. అలా ఎందుకు అవుటవుతున్నాననే విషయాన్ని ఆయన సమీక్షించుకున్నట్లు లేడు, దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించినట్లు కూడా లేడు. ఏమైనా, తన గౌరవానికే కాదు, ప్రజల అభిమానానికి కూడా భంగం కలగకూడదంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే.

English summary

 Master Blaster Sachin Tendulkar has been dismissed by left-arm spinners the most including Monty Panesar's dismissal on the first day of the Mumbai Test against England on Friday, which had led the tally to 24 till date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X