వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమెరికాలో గన్ ఉన్మాదం పెరుగుతోంది. పైకి అమెరికా అభివృద్ధిలో ఘనంగా కనిపిస్తున్నప్పటికీ ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు అక్కడి యువతలో ఉన్న నిరాశ, నిస్పృహతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే మూడు నాలుగు సంఘటనలు ఇలాంటివి జరిగాయి. గతంలో కొలరాడో థియేటర్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడ్డారు.

గురుద్వారలో మరో ఉన్మాది కాల్పులు జరిపాడు. తాజాగా పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 28 మంది వరకు చనిపోయారు. ఈ ఘటన మరవక ముందే ఆమెరికాలో మరో సంఘటన జరిగింది. పాఠశాలలో కాల్పులు జరిగిన శుక్రవారం రాత్రి లాస్‌వెగాస్‌ స్ట్రివ్‌లోని ఎక్స్‌కాలిబర్ హోటల్లో ఓ అగంతకుడు ఓ మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడిన మహిళ మరణించింది.

అయితే ఈ ఘటనలు అమెరికా సమాజంలోని అశాంతి, యువతలోని అసహనాన్ని బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. స్వేచ్ఛ పేరుతో అమెరికాలో విచ్చలవిడితనం పెరిగిపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణంగా కనిపిస్తోంది. ఉగ్రవాదులను అడ్డుకోగల్గిన అమెరికా ఇంట్లోని సమస్యను మాత్రం ఎదుర్కోలేకపోతోంది. అమెరికాలో తుపాకుల సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. దేశంలో జనాభా 30 కోట్లుగా ఉంటే తుపాకులు 27 కోట్లు ఉండటం గమనార్హం.

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

పాఠశాలలో కాల్పుల ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టిన బరాక్ ఒబామా

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

శాండీ హుక్ స్కూల్..

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

ఎంత ఘోరం జరిగింది...

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

రోదిస్తున్న మృతుల బంధువులు

 గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

కాల్పుల ఘటన జరిగిన శాండీ హుక్ గ్రామం

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

న్యూటౌన్‌లో ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శన

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

కాల్పుల ఘటన తర్వాత ఓ తండ్రి తన కూతురును పాఠశాల నుండి బయటకు తీసుకు వెళ్తూ...

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

రోదిస్తున్న యువతి

గన్ ఉన్మాదం: అమెరికా వెలుగుల వెనుక...

దేవుడా...

ఈ సంవత్సరంలోనే అమెరికాలో ఉన్మాదుల కాల్పులు నాలుగుసార్లు జరిగాయి. పాఠశాల కాల్పుల ఘటన అమెరికా చరిత్రలోనే రెండోది. అక్కడి సామాజిక జీవనంలో కూడా తప్పుందనే వారున్నారు. స్వేచ్ఛ చట్రంలో ఇరుక్కున్న అక్కడి ప్రజలు ఆ చట్రం నుండి బయటకు రాలేక పోతున్నారు. అష్టఐశ్వర్యాలు ఉండటంతో దేనికీ లోటు లేదు! మంచి చెడు చెప్పే వారు లేరు! తుపాకీ సంస్కృతి పెరుగుతుండటంతో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని వైట్ హౌస్ పైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అమెరికా వెలుగు వెనుక ఉన్న ఇలాంటి చీకటి పట్ల అక్కడి సమాజం ఆందోళన చెందుతోంది.

English summary
A young gunman killed his mother and 28 other people, including 20 children, when he went on a shooting rampage inside a US school, before turning the gun on himself, in one of the deadliest such incidents witnessed in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X