అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టపర్తి సత్యసాయి వీలునామా రాశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా వీలునామా రాశారని, నాలుగున్నర దశాబ్దాల కిందటే, తనకు 44 ఏళ్ల వయసులోనే దానిని రిజిస్ట్రేషన్ చేయించారని తాజాగా వెల్లడైంది. తన స్థిర, చరాస్తులన్నీ భక్తులు ఇచ్చినవేనని, వాటిలో ఒక్క పై సా కూడా కుటుంబ సభ్యులకు చెందని పేర్కొన్నారని తెలుస్తోంది. తన ఆస్తులను సామాజిక, ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని, వాటిని కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు.

ఆదివారం సత్యసాయి ట్రస్ట్‌కు చెందిన సత్యజిత్ పేరిట విడుదల చేసిన ఓ ప్రకటన, దా నితోపాటే విడుదల చేసిన సత్యసాయి డిక్లరేషన్ ఆ విషయాలను తెలియజేస్తోంది. తనకు ఉన్న స్థిర, చరాస్తులన్నీ భక్తులు ఇచ్చినవేనని, వాటిని ధా ర్మిక కార్యక్రమాలకే వినియోగించాలని, కుటుంబ సభ్యు లు వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి లేదని సత్యసాయి త న డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. 1967 మార్చి 23న ముం బైలో దానిని రిజిస్ట్రేషన్ చేయించారు.

సత్యసాయి బాబా డిక్లరేషన్ ఇలా సాగింది - "నేను 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను వదిలి బయటకు వచ్చి మత, సనాతన ధర్మ ప్రచారంలో నిమగ్నమయ్యాను. నాకు ప్రాపంచిక, కుటుంబ బాంధవ్యాలు ఏవీ లేవు. కుటుంబ స్థిర, చరాస్తులపై హక్కును వదులుకున్నాను. ఫలితంగా, నాకు వ్యక్తిగత ఆస్తులేవీ లేవు. భక్తు లిచ్చిన విరాళాలు, ఆస్తులకు నేను ట్రస్టీని మాత్రమే. నా నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణలోని ట్రస్ట్ ద్వారా వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలి. నా ద్వారా కుటుంబ సభ్యులెవరూ వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు.''

అయితే, సత్యసాయి శివైక్యం చెందిన రెండేళ్ల తర్వాత దీనిని బయట పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ వీలునామా నిజంగా ఆయన రాసిందేనా లేక సృష్టా అన్న అనుమానాలూ ఉన్నాయి. అయితే, ఇటువంటి అనుమానాలు ముందే వస్తాయని ఊహించిన, సత్యజిత్ ఆ వీలునామాకు అప్పట్లో సాక్షిగా ఉన్న ఇందూలాల్ షాతో అటెస్టేషన్ చేయించారు. దానిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సత్యసాయి శివైక్యం చెందినప్పుడు ట్రస్టు ఆస్తులు, ట్రస్టు సభ్యులకు వ్యతిరేకంగా వరుస కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, పదేళ్ల కిందటే సత్యసాయి ఈ డిక్లరేషన్‌ను తనకు ఇచ్చారని చెబుతున్న సత్యజిత్ అప్ప ట్లో దానిని బయట పెట్టలేదు. కానీ, 2011 నవంబర్ 16వ తేదీనే ట్రస్టు సభ్యుడు ఇందూలాల్ షాతో కలిసి డిక్లరేషన్‌ను బయట పెట్టాలని భావించానని, కానీ, ఆ తర్వా త వాయిదా వేసుకున్నానని ప్రకటనలో వివరించారు. అందుకు కారణాలను మాత్రం చెప్పలేదు. వీలునామా ను ఇప్పుడే బయట పెట్టవద్దని సత్యసాయి తనకు చెప్పా రని సత్యజిత్ పేర్కొన్నారు. వాస్తవానికి, సత్యసాయి శివై క్యం చెందిన తర్వాత ట్రస్టులో ఆధిపత్య పోరు జరుగుతోందని కథనాలు వచ్చాయి.

సత్యసాయి సోదరుడి కు మారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్, సత్యజిత్ మధ్య ఆధిపత్య పోరు ముమ్మరమైందని, రత్నాకర్‌కు చెక్ చెప్పడానికే డిక్లరేషన్‌ను బయట పెట్టారని ఒక వాదన, ఇతర కుటుంబ సభ్యులెవరూ ట్రస్టు ఆస్తులను క్లెయిమ్ చేయకుండా రత్నాకరే డిక్లరేషన్ పేరిట పావులు కదిపారని మరో వాదన వినిపిస్తున్నాయి. కానీ, ఈ వీలునామా మె యిల్‌పై ట్రస్ట్ సభ్యులెవరూ నోరు మెదపడం లేదు.

English summary
Sathya Sai baba's will was released by his aide Sathyajith. Sathya Saibaba in his will said that his property belongs to public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X