కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల కడప సీటు: జగన్‌పైనే అవినాష్ ఆశలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Avinash Reddy
హైదరాబాద్‌: కడప లోకసభ సీటుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పట్టుపట్టడంతో వైయస్ భాస్కర రెడ్డి కుటుంబం అంతర్మథనం సాగిస్తోంది. ఏళ్ల తరబడిగా కలిసికట్టుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా ఎదుర్కుంటూ వైయస్ రాజశేఖర రెడ్డికి అండదండలు అందిస్తూ వచ్చిన తమకు న్యాయం జరుగుతుందా లేదా అనుమానాలు భాస్కర్ రెడ్డి కుటుంబంలో ప్రారంభమయ్యాయి.

రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నన్నాళ్ళు అయన ఎక్కడున్నా ఆయన సోదరులు వైయస్ వివేకానందరెడ్డి, వైయస్ భాస్కరరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులే నియోజకవర్గ బరువుబాధ్యతలను మోస్తు వచ్చేవారు. గ్రామాల్లో తలెత్తే వర్గపోరులను తమ భుజాలపై వేసుకుని వారే చక్కదిద్దుతూ పరిస్ధితులను వైయస్ కుటుంబానికి అనుకూలంగా తిప్పుతూ వచ్చారు.

ఎన్నికల్లో లాంఛనంగా నామినేషన్‌ వేయడం వరకే రాజశేఖరరెడ్డి వంతుగా ఉండేది. మిగిలిన అన్ని కార్యాలు వైయస్ భాస్కరరెడ్డి, ఆయన సోదరులే చూస్తూ వచ్చేవారు. అయితే రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఇన్నిరకాల సేవలు చేస్తూ వచ్చినా వారు మాత్రం రాజకీయంగా ఏది అందుకోలేకపోయారు. పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్‌ ఛైర్మన్‌ పదవితప్ప వైఎస్‌ భాస్కరెడ్డి కూడా అంతకు మించి పదవులు పొందలేదు.

తీరా ఇపుడు వైయస్ అవినాష్‌రెడ్డికి కడప పార్లమెంట్‌ నుంచి పోటి చేసే అవకాశం ఇస్తామని మాట చెప్పినట్టే చెప్పి శర్మిలను రంగంలోకి దించటం పట్ల వైయస్ భాస్కరెడ్డితోపాటు అయన సోదరుల కుంటుంబ సభ్యులకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పులివెందులలో వైయస్ భాస్కరెడ్డి సోదరు లు కుటుంబ సభ్యులు సమావేశమై రాజకీయ మనుగడపై చర్చించినట్టు తెలుస్తోంది. జగన్‌ మాట ఇస్తే తప్పడని ఖచ్చితంగా న్యాయం చేస్తాడని భాస్కరరెడ్డి తన వారికి నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినట్టు సమా చారం.

అయితే షర్మిల కడప సీటును అంత సులువుగా వదులు కుంటుందా అన్నది కూడా చర్చకు వచ్చిందంటున్నారు. ఏదైనా తొందర పడి నిర్ణయం తీసుకోకుండా మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

English summary
YS Bhaskar Reddy family is in wait and see attitude on Kadapa loksabha seat, as YSR Congress president YS Jagan's sister Sharmila is demanding the seat. Avinash Reddy fate is depended on YS Jagan assurance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X