వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు రక్షణగా మాజీ మహిళా నక్సలైట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
దాదాపు పదేళ్ల క్రితం నక్సల్స్ దాడిలో ప్రాణాలతో బయటపడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఓ మాజీ నక్సలైట్ కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలా కనిపించిన ఆ మాజీ నక్సలైట్ కూడా చంద్రబాబు పాదయాత్రలో ఆయనకు రక్షణగా ఉండటం గమనార్హం. హోంగార్డుగా ఉంటూ బాబుకు పాదయాత్రకు దారిని క్లియర్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

టిడిపి అధికారంలో ఉండగా 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారులో ప్రయాణిస్తుండగా నక్సలైట్లు అలిపిరి వద్ద ఆయన కాలును పేల్చిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. బాబును నక్సలైట్లు అప్పుడు టార్గెట్‌గా పెట్టుకున్నారు. నక్సలైటుగా పని చేసిన ఓ మహిళ ఇప్పుడు బాబుకు రక్షణగా ఉండటం గమనార్హం.

వాలా రమాదేవి అనే మహిళ నక్సలిజంలో పని చేసి వచ్చారు. నక్సలిజంలో ఉన్నప్పుడు ఆమె పేరును స్వర్ణక్కగా పిలిచేవారు. చెన్నూరు ప్రాంతంలో 1990లలో నక్సలిజం వృద్ధికి ఆమె చాలా కృషి చేశారు. పదకొండేళ్ల వయస్సులోనే ఆమె నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. కోటపల్లి మండలం ఎడగట్టు గ్రామానికి చెందిన రమాదేవి జంగిలి గంగన్న(అలియాస్ రామన్న)తో పాటు నక్సలిజంలో పని చేసి చేసింది. గంగన్న చెన్నూరు దళం కమాండర్.

ఆ తర్వాత గంగన్నను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారు 1993లో సరెండర్ అయి కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత పునరావాసం కింద ప్రభుత్వం రమాదేవిని హోంగార్డుగా నియమించింది. తనకు ఇద్దరు పిల్లలున్నారని, వారిని వృద్ధిలోకి తీసుకు రావడమే తన ముందున్న ప్రస్తుతం ఉన్న లక్ష్యమని రమాదేవి చెబుతున్నారు. ఈమె నిర్మల్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ హోంగార్డుగా పని చేస్తోంది. బాబు పాదయాత్రలో ఆయనకు రక్షణగా ఓ హోంగార్డు ఉన్నట్లుగా తమకు తెలియదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu, who survived a Naxal attack almost a decade ago, was in for a surprise on Sunday. Clearing the way for his padayatra was a former naxalite, who is now with the Home Guard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X