హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారా చౌదరి: బయటో మాట లోపలో మాట?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
సెక్స్ రాకెట్ కుంభకోణంలో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి విచారణలో ఓ మాట, బయట మరో మాట మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగాలు, సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి లాగిందనే ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్సు పోలీసులు ఆమెను ఇటీవల అరెస్టు చేశారు. అంతకుముందు అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను ఆమె తానేం తప్పు చేయలేదని నెట్టి వేసింది. ఆ తర్వాత వారు ఆమెను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అప్పుడు కూడా ఆమె తానేం తప్పు చేయలేదని, అనవసరంగా తనను ఈ కేసులో ఇరికిస్తురన్నారని ఆరోపించింది. ఆ తర్వాత శనివారం పోలీసులు ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఆమెను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. వారి కోరికను మన్నించిన కోర్టు ఆమెను, ఆమె భర్త ప్రసాద్‌ను నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగించింది. పోలీసులు సోమవారం ఆమెను తమ కస్టడీకి తీసుకున్నారు.

ఆ సమయంలో మీడియా ఆమెను పలకరించింది. అప్పుడు కూడా ఆమె తాను ఏ తప్పు చేయలేదని చెప్పింది. అంతేకాదు తనను కొందరు రాజకీయ నాయకులు వాడుకున్నారని, అందుకు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పింది. త్వరలో బెయిల్ పైన బయటకు వచ్చి తాను అన్నింటిని చెబుతానని చెప్పింది. తనకు డిజిపి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రత్యేక రక్షణ కల్పిస్తే నిజాలు వెల్లడిస్తానని చెప్పింది.

తాను తప్పు చేయలేదని సిబిఐ విచారణ చేస్తేనే తేలుతుందని, పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని ఆరోపించింది. సిబిఐ విచారణ కోసం కోరతానని చెప్పింది. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఆమె తన తప్పులు అన్నింటినీ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అమ్మాయిలను ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు సరఫరా చేశానని తారా పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఫోన్లో శృంగారపరమైన విషయాలు మాట్లాడి అమ్మాయిలు కావాలని అడిగేవారని, వారి మాటలను రికార్డు చేసి ఎక్కువ డబ్బుల కోసం బెదిరించానని, ఉద్యోగాలు, సినీమాల్లో అవకాశాల పేరుతో వివిధ జిల్లాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్ తీసుకు వచ్చానని, వారికి ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసి ల్యాప్ టాప్‌లో భద్రపరిచి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసేదాన్నని, ఎవరైనా ఎదురు తిరిగితే వాటిని మీడియాకు ఇస్తానని బెదిరించానని ఆమె విచారణలో తెలిపిందట.

English summary
It seems, Cine actor Tara Choudary giving difference statement, what she was told in police enquiry. She was told many time that she did not make any mistake with media. But according to news Tara Chowdary has accepted her faults.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X