వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో వంశీ: ఎన్టీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టారా, వ్యూహమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ భేటీ అంశంపై చర్చకు హీరో జూనియర్ ఎన్టీఆర్ చెక్ పెట్టారా అంటే కాదని, అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్‌తో వంశీ భేటీ వెనుక జూ.ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. దీనిపై జూ.ఎన్టీఆర్ శనివారం ఓ ఛానల్ ముఖాముఖి కార్యాక్రమంలో స్పందించారు.

అందులో ఆయన వంశీ ప్రమేయంలో తన పాత్ర లేదని, వంశీ కేవలం తన అదుర్స్ సినిమాకు ప్రొడ్యూసర్ మాత్రమే అని చెప్పారు. ఆయన వ్యవహారశైలితో తనకేం సంబంధంన్నారు. నాకు ఎవరితోనూ మనస్పర్ధలు లేవని చెప్పారు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పార్టీ తనకు ముఖ్యమన్నారు. తానొక నిర్ణయం తీసుకుంటే చనిపయే వరకు కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ అవసరమనుకుంటే టిడిపి తరఫున పోటీ చేస్తానని కూడా చెప్పారు.

అదే సమయంలో తాను రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందిస్తూ.. తన వయస్సు కేవలం ఇరవయ్యేనిమిదేళ్లని, తనకు రాజకీయాలు తెలియవని, మరో ఇరవయ్యేళ్ల తర్వాతనో లేక పాతికేళ్ల తర్వాతనో తాను రాజకీయాల్లోకి వస్తాను కావొచ్చని, అసలు రాకపోవచ్చు కూడా అని చెప్పారు. టిడిపితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వంశీ ఎపిసోడ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలనుకుంటే నేరుగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడునే కలిసి చెప్పవచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు.

వంశీ, కొడాలి నానిలతో జూ.ఎన్టీఆర్‌కు మంచి మిత్రుత్వం ఉందని, అది బహిరంగ రహస్యమని, అలాంటప్పుడు ఎన్టీఆర్ కేవలం వంశీ తన ఓ సినిమాకు నిర్మాత మాత్రమే అని చెప్పడమేమిటంటున్నారు. టిడిపిని వీడనని చెబుతూ.. తన తాత పేరు, తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పేరు చెప్పిన జూనియర్ తన బాబాయి బాలయ్య పేరును గానీ, చంద్రబాబు పేరును గానీ ఎక్కడ ఉచ్చరించక పోవడాన్ని గుర్తు చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ తాత, తండ్రి, బాబాయిల పేరు స్మరించేవాడని, విభేదాల అనంతరం కేవలం తాత, తండ్రిల పేర్లు మాత్రమే చెబుతూ బాబాయి పేరును మాత్రం ఎక్కడా పలకడం లేదంటున్నారు. ఇటీవల దమ్ము సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలోనూ జూనియర్...బాలకృష్ణ పేరును ఎక్కడా చెప్పక పోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు గతంలో చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్‌ను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లా నుండి తెరపైకి వచ్చింది.

అప్పుడు జరిగిన దాని వెనుక హరికృష్ణ, జూనియర్‌లు ఉన్నారనే ప్రచారం జరిగింది. తాజాగా వంశీ వ్యవహారం వెనుక కూడా జూనియర్ ఉన్నారని అనుమానిస్తున్నారు. ఇలాంటి తెర వెనుక రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాల పట్ల అసంతృప్తి ఉన్నట్లుగా ప్రకటించడం వెనుక ఏముందో అనే చర్చ జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి రాకపోవచ్చు కూడా అన్న వ్యాఖ్యలను ఆయన వ్యూహాత్మకంగానే అన్నారని అంటున్నారు. నందమూరి అభిమానులు కూడా జూనియర్ వ్యవహారశైలి పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

పార్టీ నుండి పక్కకు జరగుతారనే ప్రచారానికి తెర దింపేందుకు, వంశీ వ్యవహారానికి చెక్ పెట్టేందుకు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రాజకీయాల్లోకి రాకపోవచ్చునని చెప్పిన అసంతృప్తి వెనుక ఏదో అర్థం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు సేఫ్ సైడ్‌లోకి వెళ్లేందుకు మాత్రమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

English summary
It is said that, Hero Junior NTR statement on Vijayawada urban president Vallabhaneni Vamsi attitude and Telugudesam party is a strategy. He said in his interview, Vamsi is only his Adurs cinema producer, he is no link with his attitude like meeting with YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X