విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాద్‌షాపై టిడిపి 'దమ్ము': ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హీరో జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా చిత్రం త్వరలో విడుదల కానుంది. తెలుగుదేశం పార్టీకి, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ తాజా సినిమా పైన ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, హీరో బాలకృష్ణకు జూనియర్ దాదాపు దూరమైనట్లేననే చెబుతున్నారు.

ఇటీవల విజయవాడలో ఫ్లెక్సీల గందరగోళం చెలరేగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో ప్రత్యక్షంగా కాకున్నా జూనియర్ పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు పలికే అవకాశాలు లేకపోలేదంటున్నారు. జూ ఎన్టీఆర్ తీరును ఇప్పటికే బాబు, బాలయ్యలతో పాటు టిడిపి వర్గాలు గుర్తించాయని, ఈ ప్రభావం ఆయన తాజా బాద్ షా సినిమా పైన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

గతంలో దమ్ము చిత్రం విడుదలకు ముందు జూనియర్ సన్నిహితుడు కొడాలి నాని వ్యవహారం బయటకు వచ్చింది. దానికి ముందే మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ.. జగన్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ ప్రభావం దమ్ము చిత్రంపై తీవ్రంగా పడిందనే వార్తలు వచ్చాయి. కలెక్షన్లు పూర్తిగా పడిపోవడానికి ఈ ఘటనలే కారణం అన్నారు. ఇప్పుడు బాద్ షా విడుదలకు ముందు కూడా విజయవాడలో ఫ్లెక్సీ రగడకు తోడు ఎన్టీఆర్ బయటకు రాకపోవడం అంతకు మించి ప్రభావం చూపించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

విజయవాడలో ఓ దుకాణ ప్రారంభోత్సవం సమయంలో, హైదరాబాదులో బాద్ షా పాటల విడుదల కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలకు తన సత్తా చాటే ప్రయత్నం జూనియర్ చేశారని, ఈ విషయాన్ని ఇప్పటికే టిడిపి క్యాడర్ గుర్తించిందని చెబుతున్నారు. అయితే, దమ్ము సినిమా సమయంలో జూనియర్ వ్యవహారం ఉందనే వార్తలు రావడంతో ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చిందని, అప్పుడే ఆయన మరో విషయం కూడా చెప్పారని గుర్తు చేస్తున్నారు.

తాను తన కట్టె కాలే వరకు టిడిపిలోనే ఉంటానని, కొడాలి నాని వ్యవహారంపై తాను బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదని, అయినా చెబుతున్నానని, ఇలాంటి ఆరోపణలు వస్తే మరోసారి వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా తాను ఎప్పుడు టిడిపిలోనే ఉంటానని ఖరాఖండిగా చెబుతున్నానని జూనియర్ అప్పుడే అన్నారని గుర్తు చేస్తున్నారు. అందుకే అతను మరోసారి బయటకు రావడం లేదని, కాబట్టి బాద్ షా పైన ప్రభావం పడే అవకాశాలు లేవని మరికొందరు అంటున్నారు.

English summary
Hero Jr NTR's silence is raising many questions on flexis erected with his images in Krishna district his political plans. It is said that Nandamuri Harikrishna has distanced from Telugudesam party president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X