వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సేఫ్ కాకుంటే... షారూక్‌ఖాన్‌‌కి ఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan-Hafiz Mohammed Saeed
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌ను జమాత్ ఉద్ దువా అనే ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ పాకిస్తాన్‌కు ఆహ్వానించాడట. అది సాధారణ ఆహ్వానం కాదు. భారత్‌లో భద్రత లేదని భావిస్తే షారూక్ పాకిస్తాన్‌కు రావొచ్చునని సూచించాడు. హఫీజ్ ముంబయి దాడుల ఘటన సూత్రధారి అని తెలిసిన విషయమే. ఇతను శనివారం పాకిస్తాన్‌లోని ఓ టెలివిజన్ ఛానల్‌లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడట.

ఆ ఇంటర్వ్యూలో అతను షారుక్‌ను ఆహ్వానించాడు. షారూక్ భారత్‌లో అభద్రతగా ఉందని భావిస్తే.. పాకిస్తాన్‌కు రావొచ్చునని సూచించాడు. తాను అతని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. షారూక్ వచ్చి పాక్‌లో ఉంటానంటే తాను సహాయం చేస్తానని చెప్పాడు. షారూక్ పాకిస్తాన్‌లో గౌరవించబడతాడని చెప్పాడు. అతను కనుక అక్కడ బాగుండలేదని భావిస్తే అతని కోసం పాక్ తలుపులు ఎప్పుడూ తెరుచుకొని ఉంటాయని చెప్పాడు.

షారూక్ ఖాన్‌కు సయీద్ సూచనలు చేయడం వెనుక ఓ కారణం ఉంది. ఇటీవల షారూక్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అతను ఈ వ్యాఖ్యలు చేశాడట. షారూక్ ఖాన్ వ్యాఖ్యలు, సయిద్ ఆహ్వానం మాట అటుంచితే... పాకిస్తాన్‌లో భద్రత ఉండదో, భారత్‌లో ఉండదో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

పాకిస్తాన్‌లో కేవలం ఇతర మతాలకు చెందిన వారే కాదు, ముస్లింలు కూడా తీవ్రవాదకార్యకలాపాల వల్ల భద్రంగా ఫీల్ కావడం లేదని అంటున్నారు. అదే భారత్‌లో అన్ని వర్గాల వారు స్వేచ్ఛగా ఉంటున్నారని చెబుతున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ కరాచీ ఇంజనీర్ తన కూతురుకు హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించారు. అంతకుముందు భారత్ అంటే అపనమ్మకం ఉండేదని చెప్పిన అతను ఇప్పుడు ఇక్కడి వారి సంస్కారాన్ని పొగుడుతూ తనకు సహకారాన్ని అందించిన సంస్థలకు లేఖ రాశారు.

English summary
Amaat-ud-Dawa chief and founder of terrorist outfit Lashkar-e-Tayyaba, Hafiz Mohammed Saeed, on Saturday invited Bollywood superstar Shahrukh Khan to Pakistan if he felt insecure in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X