హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: యుటి వర్సెస్ ప్రత్యేక రాష్ట్రం (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు హైదరాబాద్ అత్యంత కీలకమైన విషయంగా మారినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌ను చూపించి, రాష్ట్ర విభజనను ఆపించాలని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ప్రయత్నిస్తుంటే, దాన్ని ససేమిరా వదులుకోబోమని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధుల ఆలోచన మరో విధంగా ఉంది. హైదరాబాద్ మాది కాదనే భావన సీమాంధ్ర ప్రజలను కలిచివేస్తోందని సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, చిరంజీవి వంటి నాయకులు అంటున్నారు.

తాము హైదరాబాదును అభివృద్ధి చేశామని చెబుతున్నారు. దానికితోడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాదులోని సీమాంధ్రుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండబోదని వాదిస్తున్నారు. వారి భయాలను, ఆందోళనలను తీర్చడానికే అన్నట్లుగా హైదరాబాదును తెలంగాణ రాష్ట్రంలోని అంతర్భాగంగా పరిగణిస్తూ పదేళ్ల పాటు శాంతిభద్రతలను తమ చేతుల్లో ఉంచుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదా రెండో రాజధానిగా చేయాలని చిరంజీవి లాంటి నాయకులు వాదిస్తున్నారు. కానీ, దానికి హైదరాబాద్ ప్రజాప్రతినిధులు అంగీకరించడం లేదు. చిరంజీవి డిమాండ్‌పై హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. చిరంజీవిని రాజకీయ బచ్చాగా అభివర్ణించారు.

హైదరాబాద్‌పై చిరంజీవి మెలిక

హైదరాబాద్‌పై చిరంజీవి మెలిక

రాష్ట్ర విభజనకు హైదరాబాద్‌ను అడ్డం పెట్టడానికి సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదంటే దేశానికి రెండో రాజదానిగా చేయాలని చిరంజీవి డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

కావూరి కొత్త డిమాండ్..

కావూరి కొత్త డిమాండ్..

హైదరాబాద్ విషయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. హైదరాబాద్‌ను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనికి హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు సేరనంటారనే ఉద్దేశంతో ఆయన ఈ సూచనను ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్‌పై అసదుద్దీన్ పట్టు

హైదరాబాద్‌పై అసదుద్దీన్ పట్టు

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే సీమాంధ్ర నాయకుల డిమాండ్‌ను హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ డిమాండ్‌ను ముందు పెట్టిన చిరంజీవిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక రాష్టానికి దానం ఓకె

ప్రత్యేక రాష్టానికి దానం ఓకె

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్న హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్‌కు మాత్రం అంగీకరిస్తున్నారు. హైదరాబాద్‌ను ప్రత్యేకంగా రాష్ట్రంగా చేస్తే తమకు సమ్మతమేనని, అయితే రెండు విభజిస్తే మాత్రం హైదరాబాద్ తెలంగాణలో ఉండాలని ఆయన అంటున్నారు.

దానం మాటే ముఖేష్ మాట

దానం మాటే ముఖేష్ మాట

దానం నాగేందర్ అభిప్రాయాన్నే హైదరాబాద్‌కు చెందిన మరో మంత్రి ముఖేష్ గౌడ్ బలపరుస్తున్నారు. హైదరాబాద్ విషయంలో మొదటి నుంచి వీరిద్దరిదీ ఒకే మాట ఒకే బాటగా నడుస్తోంది. హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు ఉండే ఏ వ్యవస్థకైనా వారు సిద్ధంగా ఉన్నారు.

అంజన్ కుమార్ మాట కరుకు..

అంజన్ కుమార్ మాట కరుకు..

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే సీమాంధ్ర నాయకుల డిమాండ్‌ను సికింద్రబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేదని, వారు హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చెందారని ఆయన వాదిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్‌ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్‌కు మాత్రం వారు అంగీకరిస్తున్నారు. అయితే, హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం చేయడం సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. తెలంగాణకు మధ్యలో హైదరాబాద్ ఉంది. పైగా, మొదటి నుంచి తెలంగాణకు రాజధానిగా ఉంటూ వచ్చింది. దానికి తెలంగాణ నాయకులు అంగీకరించే అవకాశం లేదు.

కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే హైదరాబాదులో ప్రజాప్రతినిధులు ఉండే అవకాశం లేదు. తామంతా చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుందని, ప్రజా సమస్యలను పట్టించుకునేవారు ఉండరని, ప్రతిదానికీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్లడం ప్రజలకు సాధ్యం కాదని దానం నాగేందర్ అంటున్నారు. మొత్తం మీద, హైదరాబాద్‌ పీటముడిని వేసి రాష్ట్ర విభజనకు బ్రేకులు వేయాలనే సీమాంధ్ర నాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.

English summary
As Seemandhra leaders like Chiranjeevi and Kavuri sambasiva Rao demanding to make Hyderabad as UT, the new proposal came int fore to make Hyderabad as special state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X