• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీనివాసన్‌తో లింక్స్‌తో ధోనీ మౌనం: గంగూలీ వేరే

By Pratap
|

MS Dhoni
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మౌనం వహిస్తున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై తాను ఇప్పుడు మాట్లాడబోనని, మాట్లాడడానికి తగిన సమయం వస్తుందని ఆయన బర్మింగ్‌హామ్‌లో అన్నాడు. చాంపియన్ ట్రోఫీలో ఆడడానికి బయలుదేరే ముందు భారతదేశంలో ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడలేదు. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు వేస్తే బుద్ధులా ముఖం పెట్టేశాడు.

స్పాట్ ఫిక్సింగ్‌పై మాట్లాడడానికి ధోనీకి ఎప్పుడు సమయం వస్తుందో తెలియదు. క్రికెట్ పరువు ప్రతిష్టలను మంట గలుపుతున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై భారత క్రికెట్‌కు నాయకత్వం వహిస్తున్న ఆటగాడు మాట్లాడకపోవడం ఒక రకంగా విచిత్రంగానే కనిపిస్తుంది. అయితే, బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్‌తో ఉన్న సంబంధం వల్లనే ఆయన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై పెదవి విప్పడం లేదనే మాట వినిపిస్తోంది.

బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌కు ధోనీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సాంకేతికంగా చెన్నై సూపర్ కింగ్స్ తనది కాదని శ్రీనివాసన్ చెబుతున్నా అది ఆయనదనే విషయం బహిరంగ రహస్యమే. శ్రీనివాసన్‌కే చెందిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాసన్ అల్లుడు గురనాథ్ మేయప్పన్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయ్యాడు.

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి మాట్లాడడం ప్రారంభిస్తే వాటిన్నింటిపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం ధోనీకి తెలుసు. అందుకే, మొత్తంగానే వ్యవహారంపై మాట్లాడకుండా ఉంటే సరిపోతుందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తున్నాడు.

భారత క్రికెట్‌కు విజయాలను రుచి చూపించిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. మొదటి మ్యాచ్ ఫిక్సింగ్ కేసు 2000లో వెలుగు చూసింది. మొహ్మద్ అజరుద్దీన్, అజయ్ జడేజా అప్పుడు మ్యాచ్ పిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్నాడు. అప్పుడు గంగూలీ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ధోనీలా మౌనంగా ఉండిపోలేదు. పైగా, ధోనీ - తన జట్టును అన్నింటి నుంచి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని, చాంపియన్స్ ట్రోఫీ తమకు అత్యంత ముఖ్యమైందని, ఇది మ్యాచు పిక్సింగ్ గురించి మాట్లాడే సమయం కాదని చెప్పేసి దాటేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుత పరిస్థితి వల్ల క్రికెట్ పరువు ఏమీ పోలేదని ధోనీ అన్నాడు.

గంగూలీ ఏమన్నాడు...

"ఇతర జట్ల గురించి నాకు తెలియదు. నిశ్చితం కాని ఆరోపణలు తమ ఆటగాళ్లపై ఏ విధమైన ప్రభావం చూపవు.

ఎవరు ఏం చెప్పినా, నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండడమనేది అత్యంత ముఖ్యమని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. నీ ఆత్మకు నువ్వు నిజాయితీగా ఉంటే, ఏ ఆరోపణ కూడా నిన్ను తాకదు. మైదానంలో మేం క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించాలి.

మేం ఏం చేయలేం. ఆరోపణలు వినకుండా ఎవరికి వారు తమ తమ విధులను నిర్వహించడం ద్వారా మాత్రమే దాన్ని దాటగలం"

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MS Dhoni continued to dodge the spot-fixing issue in Birmingham on Thursday, raising some disturbing questions on whether the captain was too compromised to even comment on a corruption scandal which threatens to destabilize Indian cricket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more