వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ సర్వే: ములాయం దార్లో చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Mulayam Singh Yadav
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు! సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తరహాలోనే చంద్రబాబు కూడా రాబోయే సాధారణ ఎన్నికల కోసం సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలనే అభిప్రాయంతో ఉన్నారు. బాబు ఫిబ్రవరిలోనే కొందరు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, పార్టీలోని సమీకరణాల నేపథ్యంలో ఆయన ఆగినట్లుగా తెలుస్తోంది.

తాజాగా బాబు తప్పనిసరిగా అభ్యర్థుల విషయంలో ముందుండాలనే అభిప్రాయంతో ఉన్నారట. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలలో సర్వేలు పూర్తి చేసిన ఆయన తనయుడు నారా లోకేష్ కూడా తండ్రికి సూచనలు చేస్తున్నారట. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే రాబోయే ఇబ్బందులను ఇప్పుటి నుండే ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని తద్వారా ఎన్నికల నాటికి అంతా చక్కబడుతుందని సూచిస్తున్నారట. బాబు కూడా అందుకు సిద్ధపడుతున్నట్లుగా చెబుతున్నారు.

బాబు పాదయాత్ర మొదట జనవరి 26 వరకు నిర్ణయించారు. అందుకే ఫిబ్రవరిలో అభ్యర్థుల ప్రకటించాలని భావించారట. కానీ, ఇప్పుడు పాదయాత్ర కొనసాగుతున్నందున ఇది పూర్తి కాగానే పలువురు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏప్రిల్ లేదా మే వరకు బాబు యాత్ర కొనసాగే అవకాశముంది. అప్పటి వరకు అభ్యర్థులపై మరింత కసరత్తు చేసి తొలి జాబితా సిద్ధం చేయాలని బాబు భావిస్తున్నారు.

తనయుడు లోకేష్ ఇప్పటికే సర్వే చేసి అభ్యర్థుల చిట్టాను తండ్రి ముందు ఎప్పుడో పెట్టారట. అయితే, పాదయాత్ర కొనసాగుతున్న కారణంగా వాటిపై గుంబనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్తున్నారు. ఇంకా అలా వెళ్లే వారిని తప్పించి.. వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. లోకేష్‌తో పాటు బాబు పలు స్థానాల్లో యువత వైపు మొగ్గు చూపిస్తున్నారట. ప్రధానంగా సీనియర్లను లోకసభకు పంపించి వారి స్థానాల్లో యువతకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.

English summary
Unfazed by desertions from the party to the YSR Congress, Telugudesam chief Nara Chandrababu Naidu has begun the process of selecting nominees for Lok Sabha and Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X