వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పతకం గెల్చిన దీపికను కంటతడి పెట్టించారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Media pressure for interview leaves ace archer Deepika in tears
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి మంగళవారం కంటతడి పెట్టారు. ఇంటర్వ్యూల కోసం మీడియా ఒత్తిడి తట్టుకోలేక ఆమె కన్నీరుకార్చారు. మహిళల రికర్వ్ జట్టు సారథి అయిన దీపిక పోలండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో బంగారు పతకం గెలుచుకొని జట్టుతో మంగళవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చారు.

ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను సన్మానించింది. అనంతరం పలువురు విలేకరులో ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం వెంటబడ్డారు. తాను చాలా అలసిపోయి ఉన్నానని, పైగా మరో విమానం అందుకోవాలని ఆమె చెప్పినా మీడియా వినిపించుకోకపోవడంతో నిస్సహాయ స్థితిలో భావోద్వేగానికి లోనైన దీపిక కంటతడి పెట్టారు.

పోలండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో దీపిక నేతృత్వంలోని బొంబ్యాలా దేవి, రిమిల్ బురిలేతో కూడిన భారత త్రయం స్వర్ణం సాధించింది. కాగా మీడియాతో మాట్లాడేందుకు దీపిక కొంత దూరంగా ఉంటారని అంటున్నారు. గతంలో ఓ టోర్నమెంట్ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియానికి వచ్చిన దీపిక కోసం మీడియా గంటల కొద్దీ వేచి చూసింది. చివరికి మీడియాతో మాట్లాడాలని టోర్నీ నిర్వాహకులు సూచించినా మాట్లాడలేదు.

మరోవైపు, స్వర్ణం గెల్చుకొచ్చిన తమకు లభించిన స్వాగతంపై ఆర్చరీ టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్చరీ బృందం పోలండ్ నుంచి మంగళవారం ఉదయం భారత్‌కు తిరిగొచ్చింది. అయితే వారికి ఆహ్వానం పలికేందుకు ఆర్చరీ సంఘానికి చెందిన ఉన్నతాధికారులెవరూ ఎయిర్ పోర్ట్‌కు రాలేదు.

English summary
India's top women archer Deepika was in tears after being harassed by reporters for interviews on Monday. Deepika Kumari, the captain of women's recurve team, begged for privacy, saying she was too tired even as several reporters demanded that she give them an exclusive interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X