కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు మంత్రుల తీరే వైయస్ జగన్‌కు వరం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కడప జిల్లా కాంగ్రెసు పార్టీలోని అంతర్గత కలహాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వరంగా మారాయి. కాంగ్రెసులోని అంతర్గత కలహాలే కడప జిల్లాలో వైయస్ జగన్‌కు కలిసి వచ్చాయి. వైయస్ జగన్ సొంత జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సహకార ఎన్నికల్లో దెబ్బ తీసే అవకాశం వచ్చినప్పటికీ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. డీసీసీబి, డీసీఎంస్‌లకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో అధికార కాంగ్రెస్‌పార్టీ చేతిదాక వచ్చిన విజయాన్ని చేజార్చుకుంది.

ఆరోగ్యశాఖమంత్రి డీఎల్‌ రంవీంధ్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు నియోజకవర్గం నుంచే సహకారసంఘ ఎన్నికల్లో గెలుపోందిన ఇరిగెంరెడ్డి తిరుపాల్‌రెడ్డి డీసీసీబి అధ్యక్షుడుగా ఎన్నిక కానున్నారు. ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో డీఎల్‌ సహకారంతోనే తిరుపాల్‌రెడ్డి పిఏసిఎస్‌ అధ్యక్షడుగా ఎన్నికయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత తిరుపాల్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులతోనే డైరక్టర్‌ఎన్నికల్లో గెలిచారు. జగన్‌కు బంధువు అయిన తిరుపాల్ ‌రెడ్డిని సహకార ఎన్నికల్లో అడ్డుకునివుంటే పరోక్షంగా ఆ ప్రభావం జగన్‌పై కూడా పడి వుండేదంటున్నారు.

 DL Ravindra Reddy and YS Jagan and C Ramachandraiah

సోంతజిల్లా కడపలో జరిగిన సహకార ఎన్నికల్లో జగన్‌వర్గాన్ని దెబ్బతీసి ఉంటే ఆ ప్రభావం రాష్టమ్రంతటా వైయస్సార్ కాంగ్రెసుపై పనిచేసి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేతికి వచ్చిన ఆవకాశాన్ని మంత్రి డీఎల్వ్రీంధ్రారెడ్డి జారవిడిచి కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీశారన్న విమర్శలు సోంతసార్టీలొని ఆ జిల్లా నేతలనుంచే వినిపిస్తున్నాయి.

అదే జిల్లాకు చెందిన మరోమంత్రి రామచంద్రయ్య కూడా సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి సహకరించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా జగన్‌ ప్రాబల్యానికి అడ్డు కట్ట వేయలేదన్న ఆపవాదులు వస్తున్నాయి. అయితే మంత్రి అహ్మదుల్లా డిఎల్, రామచంద్రయ్యల మీదనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. డీసీసీబి ఎన్నికల్లో అధికారపార్టీకి చెందిన కమలాపురుం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డిని సహకార ఎన్నికల బరిలోకి దించారు.

వీర శివారెడ్డికి తొలినుంచి శత్రువుగా ప్రచారంలోఉన్న దేవాదాయశాఖమంత్రి రామచంద్రయ్య సహజం గానే వీరశివా తనయుడి ఓటమికి పరొక్షంగా పావులు కదిపారన్న ప్రచారం జరుగుతోంది. మరోపైపు ముఖ్యమంత్రికి దగ్గరవుతూ మంత్రి డీఎల్‌పై అడపాదడపా విమర్శలు చేస్తున్న వీరశివారెడ్డిని దెబ్బతీసేందుకు డీఎల్‌ వర్గం కూడా ప్రయత్నాలు చేసిందని అంటున్నారు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారా యణరెడ్డి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి సహకరించలేదన్న ప్రచారం జరుగుతోంది. మంత్రుల సహకారం ఉండి ఉంటే వైయస్ జగన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసి ఆధిక్యం సాధించి ఉండేవారమని వీరశివారెడ్డి వర్గం అంటోంది.

కడప జిల్లా సహాకార ఎన్నికల్లో డీసీసీబి, డీసీఎంస్‌ పదవులకు కాంగ్రెస్‌ పార్టీకి దక్కకుండా పోవడానికి ప్రధాన కారణం పార్టీ నాయకులే అని మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు డీఎల్‌ రవీంధ్రారెడ్డి, రామచంద్రయ్య సహకార ఎన్నికలను పట్టించుకోకపోవటం వల్లనే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఓడిందని ఇందుకు ప్రధాన కారకులు వారిద్దరే అని ఆరోపిస్తున్నారు. ఇద్దరు మంత్రులపైనా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

English summary
The inactive attitude of ministers DL Ravindra Reddy and C Ramachandraiah has helped YS Jagan's YSR Congress party in Kadapa district in cooperative elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X