వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ జగన్: బ్రదర్‌పై పదునెక్కినా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసే ఉద్దేశ్యంలో భాగంగా పలు పార్టీలు ఆయన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్‌ను కూడా ఉపయోగించుకుంటున్నాయి. జగన్‌పై మొదటి నుండి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌లను కూడా ఆయా పార్టీలు టార్గెట్ చేసుకున్నాయి. అనిల్, షర్మిల అక్రమాలకు పాల్పడ్డారంటూ విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

పది రోజుల క్రితమే బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ అనిల్, షర్మిలల గుట్టు ఇది అంటూ మీడియా ముందు ఉంచారు. దానిపై వారు సమాధానం చెప్పకపోవడంతో ఆదివారం ఆయన మరోసారి ధ్వజమెత్తారు. వారు అవినీతికి పాల్పడటం నిజమని అందుకే, తన ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడం లేదని పాయింట్ లాగారు. అంతేకాకుండా, షర్మిల ఆస్తుల చిట్టాను బయట పెట్టారు. 2004లో షర్మిల ఆస్తులు రూ.1.86 కోట్లు అయితే, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వందల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు.

కాంగ్రెసు పార్టీ నేతలు రుద్రరాజు పద్మరాజు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తదితరులు షర్మిల, అనిల్ కుమార్‌ల పైన నిప్పులు చెరిగారు. ఇతరులకు చెందిన ఐదెకరాల భూమిని మణికొండలో బ్రదర్ అనిల్ కుమార్ అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. షర్మిల, అనిల్ కుమార్‌ల ఆస్తులపై విచారణ జరిపించాలని వి హనుమంత రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు కూడా షర్మిల, అనిల్ కుమార్‌‌ల పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. రాష్ట్రంలో భూములు కబ్జా చేయడమే బ్రదర్ అనిల్ పని అంటూ చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. అగస్టా కుంభకోణం మూలాలు కూడా వైయస్ హయాంలోనే కనిపించాయని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.

వైయస్ జగన్ జైలుకు వెళ్లడంతో ఆయన సోదరు షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరిట ప్రజల్లో తిరిగి పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీంతో, జగన్ లక్ష్యంగా కాంగ్రెసు షర్మిల, అనిల్‌ల గుట్టు విప్పుతున్నారు. మరోవైపు బిజెపి కూడా తమ వైపు జగన్ ఎలాగూ రాడని తెలియడంతో అనిల్ కుమార్ ఆస్తుల చిట్టా విప్పుతోంది. మతం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, వారి ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టడంలో జగన్ పార్టీ విజయం సాధించలేకపోతోంది.

టార్గెట్ జగన్: బ్రదర్‌పై పదునెక్కినా..

కాంగ్రెసు, బిజెపి, టిడిపి తదితర పార్టీలు ఇటీవల బ్రదర్ అనిల్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

టార్గెట్ జగన్: బ్రదర్‌పై పదునెక్కినా..

జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పటిష్టత కోసం షర్మిల పాదయాత్ర నేపథ్యంలో అనిల్ పేరు బయటకు రావడం గమనార్హం. ఆయనపై అంతకుముందు ఆరోపణలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో పదునెక్కింది.

టార్గెట్ జగన్: బ్రదర్‌పై పదునెక్కినా..

అగస్టా హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించి వైయస్ పేరు తెరపైకి వస్తోంది.

టార్గెట్ జగన్: బ్రదర్‌పై పదునెక్కినా..

ఆరోపణలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి సరైన స్పందన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

దీంతో వారి ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మేలా ఉన్నాయి. పార్టీ అధికార ప్రతినిధి రోజు ఆదివారం షర్మిల, జగన్, అనిల్‌లపై ఆరోపణలు తిప్పి కొట్టినా సమర్థవంతంగా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి స్క్రిప్టు బిజెపి కార్యాలయంలో చదివారని, ఓ మహిళ ప్రజల కోసం తిరుగుతుంటే అభినందించాల్సి పోయి విమర్శించడం సమంజసం కాదని చెప్పడం మినహా వారు ఆరోపణలు అంతే స్థాయిలో ఖండించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
The Congress and BJP on Sunday alleged that YSR Congress leader YS Sharmila's husband Anil Kumar had encroached up on a land belonging to poor people in Manikonda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X