హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో ఢీ కిరణ్ పార్టీకే!, జెసిలో తమిళ ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Party fiat on T vote: CM hopes on resolution
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బతికేలా లేదని, ఆ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే కొత్త పార్టీని స్థాపించాల్సిందేనని, పార్టీ స్థాపిస్తే 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను 125 వస్తాయని కమలాపురం కాంగ్రెసు ఎమ్మెల్యే వీరశివా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారట. గురువారం పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సమయంలో వారి మధ్య విభజన, తీర్మానం, కిరణ్ ఢిల్లీ పర్యటన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి బాగాలేదని, రాజీనామాల కోసం ఒత్తిళ్లు వస్తున్నాయని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సమయంలో కిరణ్ వారితో.. ఎన్నికల వరకు తెలంగాణ ప్రక్రియపై ముందుకు వెళ్లేలా కనిపించడం లేదని చెప్పారు. విభజనపై అధిష్టానం ముందుకెళ్తే అప్పుడు ఏం చేయాలో చూద్దామని చెప్పారట.

ఆ సమయంలో వీరశివా రెడ్డి స్పందిస్తూ... ఏమైనా చెప్పండి.. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బతికేలా లేదని, ఆ ప్రాంతంలో వైయస్ జగన్‌ను తట్టుకోవాలంటే మీ నాయకత్వంలో కొత్త పార్టీని స్థాపించాల్సిందేనని, పార్టీని స్థాపిస్తే ఆ ప్రాంతంలో 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను 125 వస్తాయని, లేకపోతే లాభం లేదని, జగన్‌ను ఢీ కొనాలంటే కొత్త పార్టీని పెట్టాల్సిందేనన్నారట. దానికి కిరణ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా గట్టిగా నవ్వేసి ఊరుకున్నారట.

మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా కాంగ్రెసు పార్టీ కనుమరుగు కావడం ఖాయమని హెచ్చరించారు. తమిళనాడులో అక్కడొకటి ఇక్కడొకటి చొప్పున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కనిపిస్తున్నారని, సీమాంధ్రలో ఆ పరిస్థితి కూడా కన్పించే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారట. అయితే, అధిష్టానం తెలంగాణపై తీర్మానానికి ఆదేశించే అవకాశముందని, తీర్మానాన్ని ఓడిస్తే ముందుకు వెళ్లదని కిరణ్ వారికి చెప్పారట.

English summary
During the session, the Congress will move a resolution on Telangana which will be discussed. If the matter is put to vote, Seemandhra Congress MLAs will vote against the resolution and try to defeat it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X