వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్ లీలలు: కన్నడ నటీనటులకూ లింక్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
బెంగళూరు: ఐపియల్ బెట్టింగ్ వ్యవహారంతో కన్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు కూడా ఏమైనా సంబంధాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెటర్ శ్రీశాంత్‌కు కన్నడ తారలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీశాంత్ అరెస్టు తర్వాత లభించిన కీలక సమాచారం, బుకీలు అందించిన పలు క్లూల మేరకు ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీశాంత్ మొబైల్ ఫోన్ కాల్‌లిస్టులో ఉన్న పేర్ల ఆధారంగా ఒకరిద్దరు శాండల్‌వుడ్ నటీనటులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉండవచ్చునని, అయితే మరింత దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు నిర్ధారించలేమని పోలీసు వర్గాలు అంటున్నాయి.

బుకీల మొబైల్ ఫోన్లలో కర్ణాటకకు చెందిన కేఎంఆర్ అనే పొడి అక్షరాలతో కూడిన సందేశాలు అధికంగా ఉండడం పలు సందేహాలకు తావిస్తోందని, ఈ పొడి అక్షరాల వెనుక వ్యక్తి కోసం వేటలో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. హీరోయిన్లు లక్ష్మి రాయ్, సంజనాలకు క్రికెటర్ శ్రీశాంత్‌తో స్నేహసంబంధాలు అధికంగా ఉండడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

2009లో తనకు స్నేహితుడిగా శ్రీశాంత్ ఉన్న మాట నిజమేనని, ఆ తర్వాత అతడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదని సినీ నటి సంజనా అంటోంది. ఫిక్సింగ్ కక్కుర్తికి శ్రీశాంత్ పాల్పడకుండా ఉండాల్సిందని ఆమె వ్యాఖ్యానించింది. కోట్లకు పడగలెత్తిన శ్రీశాంత్ లక్షల కోసం ఇలా గడ్డి తిన్నాడంటే నమ్మశక్యం కావడం లేదని అన్నది.

కాగా శ్రీశాంత్‌తో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని మరో నటి లక్ష్మీ రాయ్ తేల్చిచెప్పింది. మొత్తానికి స్పాట్ ఫిక్సింగ్‌లో కొందరు సినీ హీరోయిన్లు, బుకీలకు లింక్ కల్పించారని పేర్కొంటున్న ఢిల్లీ పోలీసులు త్వరలోనే అన్ని చీకటికోణాల గుట్టు విప్పుతారని భావిస్తున్నారు.

English summary
According to news reports -police are investigating the arrested cricketer Sreeshanth links with Kannada film industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X