వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకెందుకొచ్చానో?: శ్రీకి ఏడుపు తన్నుకొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

S Sreesanth
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన శ్రీశాంత్‌కు ఏడుపు తన్నుకొచ్చింది. తాను ఎప్పుడు వెళ్లే ఓ మత గురువు తనను కలిసేందుకు రావడంతో శ్రీశాంత్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై ఏడ్చేశాడు. శ్రీశాంత్ తాను తొలి అంతర్జాతీయ మ్యాచ్ అడినప్పటి నుండి ఎలాంటి ముఖ్య సందర్భం వచ్చినా పుతువా అనే మత గురువు ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ మత గురువు శ్రీని కలిసేందుకు జైలుకు వచ్చాడు.

అతనిని చూడగానే శ్రీకి ఏడుపు ఆగలేదు. పరిగెత్తుకు వచ్చి అతని చేతులు పట్టుకొని విలపించాడు. శ్రీశాంత్ విలపించడం చూసిన ఆ మత గురువు... ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, అంతా మంచే జరుగుతుందని చెప్పాడు. తాను ఏ తప్పు చేయలేదని, అమాయకుడినని, జైలుకు ఎందుకు తీసుకు వచ్చారో తెలియడం లేదని, తన కోసం ప్రార్థించాలని ఆ మత గురువును శ్రీశాంత్ వేడుకున్నాడు.

శ్రీశాంత్ కుటుంబం ఎర్నాకులంలో పుతువా కార్యాలయానికి దగ్గరలోనే నివసించేది. వారి కుటుంబం ప్రతి వారం పుతువా వద్దకు వెళ్లి ప్రార్థనలు చేయించుకుంటుంది. పుతువా కార్యాలయానికి రెండు బ్లాకుల దూరంలోనే శ్రీ కుటుంబం ఉండేది. పుతువా శ్రీశాంత్‌ను పుతువా గురువారం కలిశారు.

అయనను కలిసిన పుతువా మాట్లాడుతూ... శ్రీశాంత్ దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గాడని, తన లెన్స్‌లు లేకపోవడంతో తలనొప్పితో బాధపడుతున్నాడని, తిండి తినడం మానేశాడని, ముఖ్యంగా ఉదయం అల్పాహారం తీసుకోవడం లేదని ఆవదేన వ్యక్తం చేశాడు. శ్రీశాంత్ ప్రత్యేక సెల్‌లో ఉన్నప్పుడు కలిసేందుకు ప్రయత్నించానని, కుదరలేదని తీహార్ జైలులో కలిశానని చెప్పాడు.

English summary
When priest John Puthuva first met him, S Sreesanth sought his blessing. He was about to play his first international match, with a career as a successful fast bowler ahead of him. Soon, meeting Puthuva became a habit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X