వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సన్' స్ట్రోక్, అల్లుడి అరెస్టు: శ్రీనివాసన్‌కు చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఆయన గొంతు దాకా వివాదంలో దిగబడ్డారు. అల్లుడు గురునాథ్ మేయప్పన్ అరెస్టుతో ఆయన తన పదవిని వదులుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు గురునాథ్‌తో సంబంధం లేదని ప్రకటించినప్పటికీ శ్రీనివాసన్‌ను వివాదం వదిలేట్లు లేదు. విందూ దారా సింగ్‌తో గురునాథ్ తన సంబంధాలను పోలీసు విచారణలో అంగీకరించారు.

అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో బిసిసిఐ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాను తప్పుకునేది లేదని శ్రీనివాసన్ ప్రకటించినా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సమయం చూసి కుమారుడు యోగేష్ కూడా శ్రీనివాసన్‌పై తిరుగుబాటు ప్రకటించారు. తండ్రిని వెనకేసుకొస్తున్నట్లు కనిపిస్తూనే ఆయన గురునాథ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Srinivasan and gurunath

తమ బావ గురునాథ్‌కు బుక్కీలతో, బెట్టింగ్‌తో సంబంధాలు కొత్త కాదని ఆయన అన్నారు. భారత బుకీలతోనే కాదు, విదేశీ బుకీలతో కూడా సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. గురునాథ్‌కు చెన్నై, దుబాయ్ బుకీలతో సంబంధాలున్నాయని, ఐపియల్ ప్రారంభం నుంచి వారితో చర్చలు జరుపుతన్నారని ఆయన అన్నారు. అతని బెట్టింగ్ వ్యాపారం బాగా పెరిగిందని, తమ తండ్రి శ్రీనివాసన్ వ్యాపారాల్లోనూ గురు ప్రాబల్యం పెరిగిందని ఆయన అన్నారు. యోగేశ్ మాటలు కూడా శ్రీనివాసన్‌కు తలనొప్పిగానే పరిణమించాయి.

ఇదిలావుంటే, సహారా యజమాని సుబ్రతో రాయ్ తీవ్రమైన హెచ్చరికలు చేశారు. శ్రీనివాసన్ బిసిసిఐ అధ్యక్షుడిగా ఉంటే టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటామని సుబ్రతో రాయ్ చెప్పారు. అదే సమయంలో టైటిల్ స్పాన్సర్ పెప్సికో ఒప్పందం రద్దు చేసుకునే ఆలోచనలో పడింది. దీంతో శ్రీనివాసన్‌పై మరింత ఒత్తిడి పెరుగుతోంది.

అవినీతి ఆరోపణలపై జగ్‌మోహన్ దాల్మియాను తప్పించారని, లలిత్ మోడీని తొలగించారని, అలాంటప్పుడు శ్రీనివాసన్‌ను ఎలా కొనసాగిస్తారని అంటున్నారు. ఈ స్థితిలో శ్రీనివాసన్‌ తనంత తానుగా బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడమో, అయన్ను తప్పించడమో తప్పదనే మాట వినిపిస్తోంది. ఏమైనా, శ్రీనివాసన్ పూర్తిగా చిక్కుల్లో పడ్డారు.

English summary
Two days after The Times of India reported his links with the betting syndicate and barely three hours after he reached the Mumbai city police crime branch, Gurunath Meiyappan was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X