విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టూడెంట్స్ గ్యాంగ్‌ వార్: జూ.ఎన్టీఆర్‌కు తలనొప్పి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్లెక్సీల గోల కొత్త కొత్త తలనొప్పులు తీసుకు వస్తోంది. చీరాల, ఖమ్మం తదితర జిల్లాల్లో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ తమ ఫ్లెక్సీలలో పెట్టాయి. ఈ రోజు(శుక్రవారం) బాద్ షా సినిమా విడుదల నేపథ్యంలో పలువురు పార్టీలకతీతంగా జూనియర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల విషయాన్ని పక్కన పెడితే కృష్ణా జిల్లాలో మాత్రం ఈ ఫ్లెక్సీల రగడ చాలా ఉంది.

జూనియర్ ఎవరి సొంతం... ఎవరికి వారు...

తాను కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పిన హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ నందమూరి బాలకృష్ణతో మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిని టిడిపి వ్యతిరేకులు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా టిడిపిని గందరగోళపర్చుతున్నారు. ఇందుకోసం బెజవాడ రాజకీయ నాయకులు జూనియర్‌ను ఎవరికి వారు సొంతం చేసుకుంటున్నారు.

Jr Ntr

జూనియర్ సన్నిహితుడిగా ముద్రపడిన గుడివాడ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొడాలి నాని తదితరులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తమ తమ ఫ్లెక్సీలలో ఏర్పాటు చేశారు. ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది. బాద్ షా విడుదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలే కాకుండా కాంగ్రెసు పార్టీ కూడా జూనియర్ ఫోటోలను ఏర్పాటు చేసింది.

మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ పేరిట బాద్ షా విడుదల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాబాయ్, మామయ్యలతో జూనియర్‌కు మనస్పర్థల ప్రచారం నేపథ్యంలో జగన్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఎవరికి వారు అతనిని సొంతం చేసుకోవాలనే అభిప్రాయంతో వెళ్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపిలో ప్రచారం చేసిన, స్వర్గీయ నందమూరి తారక రామారావు మనువడి అయిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు ఏ పార్టీ నేత అనే అనుమానాలు తలెత్తే విధంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇది టిడిపిని కూడా గందరగోళ పరుస్తోంది.

స్టూడెంట్ గ్యాంగ్స్

విజయవాడలో గతంలో స్టూడెంట్ గ్యాంగ్స్ హవా కొనసాగేది. పోలీసుల చర్యల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ స్టూడెంట్ గ్యాంగ్స్ సైలెంట్‌గా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ గ్యాంగ్‌లు మరోసారి చెలరేగుతున్నాయని అంటున్నారు. బాద్ షా విడుదల సందర్భంగా పలు స్టూడెంట్ గ్యాంగ్స్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయట. మరికొన్ని స్టూడెంట్ గ్యాంగ్స్ ఆధిపత్య పోరు కోసం వెలుగులోకి రావచ్చునని అంటున్నారు.

English summary

 All the parties(Telugudesam, YSR Congress, Congress) are trying to own Hero Junior NTR image. All the party leaders are using Jr NTR photos in their flexees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X