వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ వర్సెస్ క్లార్క్: నువ్వా, నేనా..

By Pratap
|
Google Oneindia TeluguNews

MS Dhoni - Clarke
చెన్నై: ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భారత, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై ఉత్కంఠ చోటు చేసుకుంది. ఇరు దేశాల జట్లు మాత్రమే కాకుండా, ఇరు జట్ల కెప్టెన్లు కూడా సమవుజ్జీలు కావడమే ఈ ఉత్కంఠకు, ఆసక్తికి కారణం. సాధారణంగా స్వదేశీ పిచ్‌లపై ఎంతటి జట్టునైనా మట్టి కరిపించే టీమిండియాకు కంగారూలేమీ మినహాయింపు కాదనే అభిప్రాయం ఉంది. ప్రతీకారంతో భారత్ ఉగిపోతుండగా, సొంత గడ్డపై భారత్‌ను ఓడించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది.

భారత్‌ నిరుడు ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపై ఎదుర్కొన్న క్లీన్‌స్వీప్‌కు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఇండియా ఉంది. అందుకు అనుగుణంగానే సొంతపిచ్‌లపై తమ ప్రధాన అస్త్రమైన స్పిన్‌ బౌలింగ్‌కు మరింత పదును పెడుతోంది. దానికి తోడు పిచ్‌లు కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉండేలా చూసుకుంటోంది. ఇటీవల ఆస్ట్రేలియా పూర్తి చేసుకున్న టెస్ట్‌ సీరీస్‌లలో శ్రీలంక, వెస్టిండీస్‌లపై పూర్తి ఆధిపత్యం కొనసాగించి మంచి ఫామ్‌లో ఉంది. అయితే, భారత పర్యటనలో మాత్రం ఆ దూకుడు కొనసాగకపోవచ్చునని వామప్ మ్యాచుల తీరు తెలియజేస్తోంది.

స్వదేశీ గడ్డపై భారత స్పిన్‌ బౌలింగ్‌కు ఎదురులేకపోవడం అందుకు ఒక కారణం కాగా, స్పిన్‌ను ఎదుర్కునే విషయంలో కంగూరులు మొదటి నుంచి బలహీనంగానే ఉండడం రెండో కారణం. అయితే, ఇటీవలి కాలంలో సొంతపిచ్‌లపైనే ఇంగ్లాండ్‌ చేతిలో భారత్ ఓటమి చవి చూసింది. ఇంగ్లాండు జట్టు ప్రదర్శించిన సహనం, సమయస్ఫూర్తి ఆస్ట్రేలియాకు కొన్ని పాఠాలను అందించే ఉంటుంది. జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కీలక సమయంలో విఫలమవుతుండం భారత్‌కు ఓ సమస్య మారింది. దానికితోడు, పేస్‌ బౌలింగ్‌లో పస కనిపించడం లేదు. యువకులకు మార్గదర్శనం చేస్తూ, సచిన్ టెండూల్కర్ అనుభవాన్ని వాడుకుంటే ధోనీ ముందుకు సాగే అవకాశం ఉంది.

కెప్టెన్‌గా భారత్‌లో తొలి టెస్ట్‌ సీరీస్‌కు నాయకత్వం వహించనున్న మిచెల్‌ క్లార్క్‌ తన టెస్ట్‌ కెరీర్‌ను భారత్‌పైన ప్రారంభించడం. తొలి మ్యాచ్‌లోనే 168 పరుగులతో విరుచుకుపడ్డ క్లార్క్‌ భారత్‌తో ఆడిన మొత్తం 18 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు శతకాలు ఒక డబుల్‌ శతకంతో పాటు ఒక త్రిపుల్‌ శతకం కూడా నమోదు చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ ప్రస్తుత జట్టులో అనుభవజ్ఞులైన కొందరిలో ఒక్కడు.

తన టెస్ట్‌ కెరీర్‌లో 89 మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌ అత్యధిక స్కోరు 329 పరుగులుగా నమోదు చేసి 6989 పరుగులతో ఉన్నాడు. మొత్తంగా తన కెరీర్‌లో 22 శతకాలు బాదిన క్లార్క్‌ 25 అర్ధ శతకాలతో 56.05 సగటును కూడా నమోదు చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఎక్కువ అనుభవం లేకపోయినప్పటికీ ఆసీస్‌ను దాదాపుగా విజయ పథాన నడుపుతున్న సమర్ధవంతమైన నాయకుడిగానే భారత పర్యనటకు వస్తున్నాడు.కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌ను ఎన్నో మైలురాళ్లను దాటించి విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న ధోనీకి ప్లస్ పాయింట్ అవుతుంది.

English summary

 The test series between India and Australia to be begin with Chennai test from February 22 will be a test for MS Dhoni and Clarke as captains for respective teams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X