వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్తకు బ్రాహ్మణి అండ: తెరవెనుక పాలిటిక్స్‌లో చక్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Brahmani
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోడలు, టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణ తనయ బ్రాహ్మిణి రాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పనున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బ్రాహ్మిణి బుధవారం వరంగల్ జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న తన మావయ్య బాబును కుటుంబ సభ్యులతో సహా కలుసుకున్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఆమె త్వరలో హెరిటేజ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

బాబు తనయుడు, బ్రాహ్మిణి భర్త నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో వచ్చే జూన్ నుండి కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికలు మరెంతో దూరం లేనందున ఆయన పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన స్థానంలో హెరిటేజ్ బాధ్యతలను బ్రాహ్మిణి చూసుకుంటారు. బాబు సతీమణి భువనేశ్వరి నిత్యం హెరిజేట్ కంపెనీ లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంటారు.

లోకేష్ కంపెనీ వ్యవహారాలు చూసుకున్నారు. ఇప్పుడు అత్తకు తోడుగా బ్రాహ్మిణి కంపెనీ వ్యవహారాలు చూసుకుంటారు. అయితే బ్రాహ్మిణి కేవలం హెరిటేజ్ వ్యవహారాలకే పరిమితం కాకుండా టిడిపి పైన కూడా దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. గతంలో చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ... బ్రాహ్మిణి ఈజిప్టు ఉద్యమాన్ని అధ్యయనం చేస్తోందని తెలుగు తమ్ముళ్లతో చెప్పారట.

బ్రాహ్మిణి ప్రత్యేకంగా ఈజిప్టు ఉద్యమంపై రీసెర్చ్ చేస్తోందని బాబు చెప్పడం వెనుక ఆమె రాజకీయాల్లో తెరవెనుక పార్టీకి అండగా నిలువనుందనే ఉద్ధేశ్యమే కావొచ్చునని అంటున్నారు. నారా లోకేష్ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటూ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు పార్టీకి ఎంతో ముఖ్యం. ఇలా పలు కారణాల వల్ల ఈజిప్టు ఉద్యమంపై రీసెర్చ్ చేసిన బ్రాహ్మిణి పార్టీ బలోపేతం కోసం తెరవెనుక బాబుకు, లోకేష్‌కు టిప్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary

 It is said that Nara Lokesh's wife Brahmini may work for Telugudesam Party in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X