• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దటీజ్ మోదీ సమయస్ఫూర్తి: అర్థరాత్రి గుట్టుచప్పుడుగా డోక్లాం వివాదం పరిష్కారం

By Swetha Basvababu
|
  Doklam stand off resolved because of Modi అర్థరాత్రి గుట్టుచప్పుడుగా డోక్లాం పరిష్కారం | Oneindia

  న్యూఢిల్లీ: డోక్లాం.. ప్రపంచపటం మీద సూదిమొన మోపేంత భూభాగం కూడా కాదు. భూటాన్‌కు చెందిన ఆ చిన్న భూమి చెక్కమీద చైనా రోడ్డు వేసే నెపంతో కాలు మోపింది. భూటాన్‌తో రక్షణ ఒప్పందం కలిగిన భారత్ అడ్డువెళ్లింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ. రెండు ఆసియా దిగ్గజాల మధ్య యుద్ధం తప్పదా? అనేంత దూరం వెళ్లింది. చైనా అధికార మీడియా అనునిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యాలతో, అర్థసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విపరీతంగా ప్రయత్నాలు సాగించింది.

  చివరకు ఇరు దేశాలు వెనుకకు తగ్గడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ - చైనా భాయ్‌భాయ్ కరచాలనాలతో డోక్లాం సమస్యకు తెరపడింది. సమస్య పరిష్కారం ఎలా జరిగిందీ వివరాలు పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే అధికారవర్గాలు నోరు విప్పుతున్నాయి. అదీ పేర్లు వెల్లడించకుండా ఇరు దేశాల మధ్య సంధి కుదిరిన తీరును బయటపెడుతున్నాయి.

  మూడు గంటల నిరంతర చర్చలతో ఒక కొలిక్కి..

  మూడు గంటల నిరంతర చర్చలతో ఒక కొలిక్కి..

  గత నెల 27వ తేదీన సాయంత్రం పొద్దుపోయిన తర్వాత చైనాలో భారతరాయబారి విజయ్ గోఖలేకు చైనా ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. అప్పుడాయన హాంకాంగ్‌లో ఉన్నారు. భారత్ - భూటాన్ - చైనా దేశాల మధ్య సిక్కింలోని డోక్లాం ముక్కోణ జంక్షన్ వద్ద 73 రోజులపాటు నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెర దించేందుకు అవసరమైన సంప్రదింపులు జరిపేందుకని సంకేతాలిచ్చింది బీజింగ్. దీంతో విజయ్ గోఖలే హడావుడిగా బీజింగ్‌కు వెళ్లే విమానంలో టిక్కెట్ బుక్ చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. రాత్రి 2 గంటలకు డోక్లాం చిక్కుముడి విప్పడంపై చైనా విదేశాంగశాఖ అధికారులతో ఆయన మంతనాలు ప్రారంభం అయ్యాయి. మూడు గంటలు మల్లగుల్లాలు పడ్డ తర్వాత ఉభయపక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించింది. మరుసటి రోజు రెండు దేశాలు ప్రతిష్టంభన తొలగిపోయినట్టు ప్రకటించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకున్నది. అంతేకాదు.. ఘర్షణలు నివారించి, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని తీర్మానించుకున్నట్టు భారత్, చైనా వెల్లడించాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి.

  నేతల అంగీకారమే కీలకం

  నేతల అంగీకారమే కీలకం

  పరస్పర ప్రయోజనకారిగా ఇరు దేశాల మధ్య బంధం ఇలా

  జియామెన్‌లో బ్రిక్స్ 9వ వార్షిక సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కుదిరిన స్థూల ఒప్పందం సమస్య పరిష్కారానికి పునాది వేసిందని సీనియర్ విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా, అభివృద్ధి రథాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లే సాధనంగా ఉపయోగించుకోవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ కూడా ఇదే చెప్పారు. సరిహద్దు ఘర్షణలను నివారించి ఆరోగ్యకరమైన, సుస్థిరమైన అభివృద్ధికి ఊతం ఇవ్వాలని బ్రిక్స్ సదస్సు సందర్భంగా విడిగా కలుసుకున్నప్పుడు నేతలిద్దరూ అంగీకారానికి వచ్చారని ఆయన బీజింగ్‌లో మీడియాకు చెప్పారు. ఇరు దేశాల అధినేతల చర్చలు విజయవంతం అయ్యాయని చెప్పారు. భారత - చైనా సంబంధాలు పట్టాలు తప్పలేదు. రెండు దేశాల అనుబంధం ప్రపంచ భవిష్యత్‌కు ప్రతీక. పరస్పర ప్రయోజనకరమైన సహకారం అనివార్యం.. సరైన మార్గం అని వాంగ్ యీ నొక్కిచెప్పారు.

   చైనా మీడియా రెచ్చగొట్టినా సంయమనం

  చైనా మీడియా రెచ్చగొట్టినా సంయమనం

  డోక్లాం ప్రతిష్ఠంభన కొనసాగుతున్నన్ని రోజులూ ప్రధాని నరేంద్ర మోదీ కఠినమైన క్రమశిక్షణను అమలు చేశారు. ప్రకటనలు విదేశాంగశాఖ ద్వారానే జరుగాలి. ‘ఎవరు పడితే వారు మాట్లాడి గందరగోళం సృష్టించరాదు' అనే నిబంధనను ఆయన కఠినంగా అమలు చేశారు. చివరకు బీజేపీ నేతలను కూడా కట్టడి చేశారు. అందువల్లే చైనా మీడియా ఎంతగా రెచ్చగొట్టినా పాలక పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు. బీజేపీలో అంతర్గతంగా చైనాపై కిరికిరి వినిపించినా ఆయన పట్టించుకోలేదు. సర్కార్ ఊగిసలాట ధోరణి చూపుతున్నదన్న విమర్శలకూ ప్రధాని నరేంద్రమోదీ స్పందించలేదు. ఈ క్రమశిక్షణ ఎంతగా అలవడిందంటే చివరకు ప్రతిష్టంభన తొలగిపోయినప్పుడు విజయోత్సాహం ప్రకటించడమూ పెద్దగా జరుగలేదు. పార్టీవర్గాలు ఇప్పుడు ప్రధాని దౌత్య ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

  ముందుచూపుతో మోదీ వ్యూహం

  ముందుచూపుతో మోదీ వ్యూహం

  ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పుడు చైనాతో సంబంధాలు ప్రభావితం కాకుండా ప్రధాని మోదీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ కాలంలోనే అరడజను మంది మంత్రులు చైనాకు అధికారిక కార్యక్రమాలపై వెళ్లివచ్చారు. దూకుడుకు పేరుపడ్డ ప్రధాని నరేంద్రమోదీ సంయమనంతో నెరపిన దౌత్యం ఫలితాలనిచ్చిందని క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. చాయ్‌వాలా విదురనీతిని మెచ్చుకున్నారు.

  English summary
  NEW DELHI: Late in the evening on August 27, Indian ambassador to China Vijay Gokhale was told the Chinese were keen to know how soon they could meet him. Gokhale conveyed that he was in Hong Kong and could reach only past midnight even if he booked himself on the first Beijing-bound flight. He was urged to reach the Chinese capital as fast as he could, in a first clear indication that the quiet and dogged attempt to defuse the Doklam imbroglio may have borne fruit.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X