వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జాంగ్ ఉన్. ఐదడుగుల ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఉత్తరకొరియా ప్రజలను రాచిరంపాన పెడుతున్న కిమ్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kim Jong Un : 8 Strange And Ridiculous Facts 8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి | Oneindia

ప్యోంగ్‌యాంగ్: అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జాంగ్ ఉన్. ఐదడుగుల ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఉత్తరకొరియా ప్రజలను రాచిరంపాన పెడుతున్న కిమ్.. ప్రపంచ దేశాలన్ని తన ముందు మోకరిల్లాలని, తన పేరెత్తితేనే హడలిపోవాలని పిచ్చి కలలు కంటున్నాడు.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకున్న కిమ్.. ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఆ దేశాన్ని ఓ 'మిస్టరీ' దేశంగా మార్చేశాడు. అసలు ఉత్తరకొరియాలో ప్రజలు ఎలా బతుకుతున్నారు?, వారి వాస్తవ జీవన పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న కనీస విషయాలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. తమ దేశానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్రా సమాచారమేది ఉత్తరకొరియా లీక్ చేయదు.

ఇంతటి ఘనుడైన కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలున్నాయి. ప్రాణాలకు తెగించి కొంతమంది జర్నలిస్టులు చేస్తున్న సాహసోపేతమైన రిపోర్టింగ్‌తో ఉత్తరకొరియా మిస్టరీల్లో కొన్నైనా వెలుగుచూస్తున్నాయి. అందులో భాగంగానే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగతానికి సంబంధించి 8 ఆసక్తికర విషయాలు గతంలో వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కిమ్ వయసు ఒక మిస్టరీ:

కిమ్ వయసు ఒక మిస్టరీ:

కిమ్ జాంగ్-ll నుంచి పాలనా పగ్గాలు అందుకున్న కిమ్ జాంగ్ ఉన్ అసలు వయసెంత అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బహుశా.. ప్రపంచంలో అతనే అత్యంత పిన్న వయస్కుడైన పాలకుడై ఉంటాడన్న వాదన కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారం లేదు.

ఉత్తరకొరియా ప్రజలకు కూడా కిమ్ పుట్టిన తేదీకి సంబంధించి ఎటువంటి క్లూ తెలియదు. కొంతమంది మాత్రం అతను 1983 లేదా 1984సంవత్సరంలో పుట్టి ఉంటాడని చెబుతుంటారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ 2016లో కిమ్ జాంగ్ ఉన్ పుట్టిన తేదీని 'జనవరి 8, 1984'గా గుర్తించింది.

మారు పేరుతో స్విస్‌లో చదువు:

మారు పేరుతో స్విస్‌లో చదువు:

కిమ్ జాంగ్ ఉన్ చదువంతా స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ లో సాగినట్లు చెబుతారు. చికాగో బుల్స్ షర్ట్, నైక్ షూస్ ధరించి స్కూల్ కు వెళ్లేవాడని చెబుతారు. స్నేహితులకు తన అసలు పేరు కాకుండా మారు పేరుతో పరిచయం చేసుకునేవాడని అంటారు. స్నేహితులతో తన పేరు పాక్ ఉన్ అని చెప్పుకునేవాడు. కొత్తవాళ్లతోను అలాగే పరిచయం చేసుకునేవాడు.

కిమ్ చదువు కోసం విపరీతమైన డబ్బు ఖర్చు చేసేవారట. అయితే చదువు కన్నా బాస్కెట్ బాల్, మ్యూజిక్ అంటేనే కిమ్ ఎక్కువ మక్కువ చూపేవారట. అలా చదువుల్లో కిమ్ ఎప్పుడూ పూర్ స్టూడెంట్ అని చెబుతారు. మ్యాథమేటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కిమ్ మరీ పేలవంగా ఉండేవాడని అంటారు. అలా అతని చదువంతా లోయర్ గ్రేడ్ లోనే సాగింది.

చబ్బీగా ఉండటానికి కారణమదే:

చబ్బీగా ఉండటానికి కారణమదే:

కిమ్ శరీరాకృతిని గమనిస్తే రుబ్బు రోలు మాదిరి కనిపిస్తాడు. అతని చబ్బీ చీక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తాయి. స్విస్ చీజ్ అంటే పడి చచ్చే కిమ్.. ప్రతీరోజు పరిమితికి మించి దాన్ని తింటాడు. అందువల్లే లావెక్కువై, అతని చీక్స్ కూడా చబ్బీగా కనిపిస్తుంటాయి. లావు కారణంగా చాలా బద్దకంగా నడుస్తుంటాడు.

ట్రైనింగ్ లేకుండానే మిలటరీ కమాండర్ గా:

ట్రైనింగ్ లేకుండానే మిలటరీ కమాండర్ గా:

పాలకులు తలుచుకుంటే.. కాని పనేమి ఉంటుంది చెప్పండి. సర్వం తమ ఆధీనంలోనే ఉన్నాక.. ఎందులోనైనా తల దూర్చవచ్చు. అలా కిమ్ కూడా మిలటరీలోను తలదూర్చాడు. 2011లో అతని తండ్రి చనిపోయిన తర్వాత ఉత్తరకొరియా సైన్యానికి తనను తాను కమాండ్ గా ప్రకటించుకున్నాడు. అలా.. ఆయుధ శిక్షణ లేకుండానే మిలటరీ కమాండర్‌గా కొనసాగాడు.

సర్జరీ కూడా చేయించుకున్నాడు:

సర్జరీ కూడా చేయించుకున్నాడు:

అచ్చు తన తాత కిమ్-ll సంగ్ లాగా కనిపించేందుకు తన ముఖాన్ని సర్జరీ చేయించుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది. తాత పోలికలు అచ్చు గుద్దినట్లు ఉండేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెబుతారు.

బార్బర్స్ అంటే భయం:

బార్బర్స్ అంటే భయం:

ప్రపంచాన్ని వణికిస్తున్న కిమ్ జాంగ్‌కు బార్బర్స్ అంటే మాత్రం భయమట. అందుకే తన జుట్టును తానే కట్ చేసుకుంటాడని అక్కడి జనం చెబుతుంటారు. ఇకపోతే ఉత్తరకొరియాలో హెయిర్ స్టైల్ పట్ల ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏజ్ గ్రూపుకు ఒక్కో తరహా హెయిర్ స్టైల్ ఉంది. ప్రత్యేకించి మగవారంతా కిమ్ హెయిర్ స్టైల్ ను, ఆడవాళ్లంతా అతని భార్య రిసోల్-జు హెయిర్ స్టైల్ ను పాటించాలన్న ఆదేశాలు అక్కడ అమలులో ఉన్నాయి.

బాస్కెట్ బాల్-డై హార్డ్ ఫ్యాన్:

బాస్కెట్ బాల్-డై హార్డ్ ఫ్యాన్:

ప్రపంచంలో కిమ్ అత్యంత ఆరాధించేది బాస్కెట్ బాల్ గేమ్. స్విట్జర్లాండ్‌లో చదువుకునే రోజుల్లో ఈ ఆట పట్ల ఆకర్షితుడయ్యాడు. చికాగో బుల్స్ బాస్కెట్ బాల్ టీమ్ అంటే అతనికి అభిమానం. బాస్కెట్ బాల్ ఆటగాడు మైకెల్ జోర్డాన్ ఆటకు కిమ్ పెద్ద ఫ్యాన్. ఎన్.బి.ఏ స్టార్ డెన్నీస్ రోడ్ మాన్ కిమ్ కు అత్యంత సన్నిహితుడు. చాలాసార్లు డెన్నీస్ ఉత్తరకొరియాలో పర్యటించాడు కూడా.

హత్యారోపణలు:

హత్యారోపణలు:

కిమ్ జాంగ్ ఉన్ పై చాలానే హత్యారోపణలున్నాయి. తన సొంత మామను సైతం కిమ్ హత్య చేశాడని చెబుతారు. అత్యంత పాశవికంగా కుక్కల బోనులోకి అతన్ని పంపించి హత్య చేశాడంటారు. అతని హత్య సమయంలో అడ్డుపడినందుకు అత్తను కూడా విషమిచ్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఇక మలేషియాలో కిమ్ సోదరుడి హత్య కూడా అతని పనే అన్న ఆరోపణలున్నాయి.

English summary
It's been a little over five year since Kim Jong-un came into power in North Korea. Here are some interesting facts about the world's most "secretive" leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X