• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫైనల్‌కు బెంగుళూరు: ఎవరీ డివిలియర్స్? (ఫోటోలు)

By Nageswara Rao
|

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఛాంపియన్‌గా నిలవాలన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చిరకాల స్వప్నం నెరవేరేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో రసవత్తర మలుపులు తిరిగింది.

ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి జట్టును ఒంటి చేత్తో ఐపీఎల్ 9 ఫైనల్‌కు చేర్చాడు ఏబీ డివిలియర్స్. సెంచరీలు చేయడం అలవాటుగా మార్చేసుకున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్‌ విఫలమయ్యాడు.

ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ కూడా సున్న పరుగులకే ఔటయ్యాడు. షేన్ వాట్సన్ కూడా విఫలమైన వేళ ఏబీ డివిలియర్స్ 47 బంతుల్లో 79 పరుగులతో విధ్యంసాన్ని సృష్టించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

IPL 2016: ఫోటో గ్యాలరీ

ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్ బెర్తు సొంతమైపోయినట్లు గుజరాత్ లయన్స్ ఆటగాళ్లలో ఆనందం కనిపించింది. ఇలాంటి సమయంలో అద్భుతమైన బ్యాటింగ్‌కు చేసి గుజరాత్ ఆటగాళ్ల ఆనందాన్ని ఎక్కువ సేపు నిలువకుండా చేశాడు ఏబీ డివిలియర్స్.

ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని, అంచనాలు లేని మ్యాచ్‌లో రాణించడం ఏబీ డివిలియర్స్ ప్రత్యేకత. ఏబీ డివిలియర్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరుపున ఆడుతున్నాడని చాలా మంది అనుకుంటారు.

Also See: ఏబి విధ్వంసంతో 'విరాట్ సేన' ఫైనల్‌కు

కానీ ఏబీ డివిలియర్స్ ఓ క్రికెటర్ మాత్రమే కాదు. అతను ఓ మల్టీ టాలెంటెడ్. ఏబీ డివిలియర్స్ గురించి చాలా మందికి తెలియని విషయాలు మీకోసం ప్రత్యేకం:

* దక్షిణాఫ్రికా తరుపున జూనియర్ నేషనల్ హాకీ జట్టులో గోల్ కీపర్‌గా ఆడాడు.

* దక్షిణాఫ్రికా తరుపున జూనియర్ నేషనల్ పుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు

* దక్షిణాఫ్రికా జూనియర్ రగ్భీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు

* దక్షిణాఫ్రికాలో ఆరు పాఠశాలల స్విమ్మింగ్ రికార్డులను కలిగి ఉన్నాడు

* 100 మీటర్ల పరుగు పందెంలో జూనియర్ అథ్లెటిక్స్‌ విభాగంలో అత్యంత వేగవంతమైన రికార్డు

* దక్షిణాఫ్రికా జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో మెంబర్

* దక్షిణాఫ్రికా నేషనల్ బ్యాడ్మింటన్ అండర్-19 ఛాంపియన్

* అండర్ - 19 గోల్ఫ్ టోర్నమెంట్ విజేత

* దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్‌లో కేన్సర్ ఆసుపత్రిని నెలకొల్పాడు.

* జింబాబ్వేలో ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాభివృద్ధి తోడ్పాటుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగళూరు జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ లయన్స్‌తో మంగళవారమిక్కడ జరిగిన క్వాలిఫయర్‌-1లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి మరో 10 బంతులు మగిలుండగానే విజయాన్ని సాధించింది.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

విరాట్‌ కోహ్లీ (0), క్రిస్‌ గేల్‌ (9), కేఎల్‌ రాహుల్‌ (0), షేన్‌ వాట్సన్‌ (1) తక్కువ స్కోరుకే అవుటైనా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఏబీ డివిల్లీర్స్‌ (47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీతో జట్టును గెలిపించాడు. చివర్లో ఇక్బాల్‌ అబ్దుల్లా (33 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

గుజరాత్ బౌలర్లలో ధవళ్‌ కులకర్ణి (4/14) బెంగళూరును దెబ్బతీశాడు. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో డ్వేన్‌ స్మిత్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ (26) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. కోహ్లీని తన తొలి ఓవర్లోనే అవుట్‌ చేసిన ధవళ్‌ కులకర్ణి బెంగళూరును తొలి దెబ్బ కొట్టాడు. ఈ షాక్‌ నుంచి కోలుకోకముందే తన రెండో ఓవర్లో గేల్‌, రాహుల్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చి ఆతిథ్య జట్టును మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఈ దశలో డివిల్లీర్స్‌, వాట్సన్‌ ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ కావడంతో కెప్టెన్‌ రైనా.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జడేజాను రంగంలోకి దింపాడు. ఇది ఫలితాన్నిచ్చింది. జడేజా తన తొలి ఓవర్లోనే వాట్సన్‌ను బలిగొన్నాడు. అతని స్థానంలో వచ్చిన సచిన్‌ బేబీ (0)ని కూడా కులకర్ణి అవుట్‌ చేశాడు. దీంతో 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఈ దశలో ఏబీ డివిలియర్స్, స్టువర్ట్‌ బిన్నీ (21) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. జడేజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన ఏబీ పామ్‌లోకి వచ్చాడు. ఇక జకాతి ఓవర్లో బిన్నీ 4, 4, 6తో అలరించాడు. అయితే అతని జోరుకు జడేజా బ్రేక్‌ వేశాడు.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

పదో ఓవర్లో అతణ్ని ఎల్బీగా వెనక్కి పంపాడు. మరోవైపు సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో డివిల్లీర్స్‌ జోరు పెంచాడు. ఇక్బాల్‌ అబ్దులా చక్కటి సహకారం అందించడంతో ధాటిగా ఆడాడు. స్మిత వేసిన 15వ ఓవర్లో బౌండ్రీతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేసుకున్న ఏబీ ఆ తర్వాతి బంతినే స్టాండ్స్‌లోకి పంపాడు. జకాతి వేసిన ఆ తర్వాతి ఓవర్లోనూ మరో సిక్స్‌ కొట్టాడు.

 ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

ఫైనల్‌కు బెంగుళూరు: డివిలియిర్స్ విధ్వంసకర బ్యాటింగ్

అదే ఓవర్లో అబ్దుల్లా కూడా సిక్స్‌ బాదాడు. దీంతో చివరి 24 బంతుల్లో బెంగళూరు విజయానికి 33 పరుగులు కావాల్సి వచ్చింది. ప్రవీణ్‌ బౌలింగ్‌లో డివిల్లీర్స్‌ 6, 4 రాబట్టడంతో 17వ ఓవర్లో 12 పరుగులొచ్చాయి. బ్రావో వేసిన తర్వాతి ఓవర్లో అబ్దుల్లా హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. 19వ ఓవర్లో అబ్దుల్లా విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru, May 24: Ab de Villiers played a breathtaking knock to singlehandedly lead Royal Challengers Bangalore fightback and take them into the Indian Premier League final with a thrilling four wicket win over Gujarat Lions here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more